ఐబీఈఎఫ్వోఆర్జీ సర్వేలో వెల్లడి
హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): ఆన్లైన్ షాపింగ్ ఎక్కువగా జరుగుతున్న నగరాల్లో హైదరాబాద్ దేశంలోనే 5వ స్థానంలో ఉన్నట్టు ఐబీఈఎఫ్వోఆర్జీ సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఢిల్లీ, బెంగళూరు, ముంబై, చెన్నై, హైదరాబాద్ నగరాలు టాప్-5 స్థానాల్లో నిలిచాయి. దేశంలో ప్రతి రోజూ 100 మిలియన్లు (పది కోట్లు) మంది వినియోగదారులు ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నట్టు పేర్కొన్నది. 2025 నాటికి ఆన్లైన్ షాపింగ్ చేసే వారి సంఖ్య రోజుకు 300 మిలియన్లకు చేరుతుందని అంచనా వేసింది. 2020తో పోల్చుకొంటే 2021లో ఆన్లైన్ వ్యాపారం 38 శాతం పెరిగినట్టు తెలిపింది.