వనస్థలిపురం, ఫిబ్రవరి 28: డ్రైనేజీ సమస్యలు తలెత్తినప్పుడు సిబ్బంది తక్షణమే స్పందించాలని బీఎన్‌రెడ్డినగర్ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి అన్నారు. సాహెబ్‌నగర్‌లో మ్యాన్‌హోల్ విరిగి స్థానికులు, వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తోంది. చెత్త చేరి మురుగునీరు జామ్ అవుతోంది. స్థానికుల ఫిర్యాదుతో సోమవారం అక్కడికి వెళ్లిన కార్పొరేటర్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి మరమ్మతులు చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కడ డ్రైనేజీ సమస్య వచ్చినా మురుగుతో స్థానికులు ఇబ్బందులు పడుతారన్నారు. ఫిర్యాదు వచ్చిన వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని సూచించారు.