
మూసాపేట, నవంబర్ 11: విద్యుత్ షాక్‌కు గురైన మహిళ మృతి చెందిన సంఘటన కూకట్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకున్నది. కూకట్పల్లి సీఐ నర్సింగ్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్పల్లి విజ్ఞానపురి కాలనీకి చెందిన నారాయణరెడ్డి ఇంట్లో శోభ (40) పని మనిషిగా ఏడు నెలలుగా పనిచేస్తున్నది. గురువారం మేడ పైకి మోటర్తో నీళ్లు ఎక్కిస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.