శంషాబాద్ రూరల్, మార్చి 30: శంషాబాద్ పట్టణ ప్రజల తాగునీటి సమస్యను పరిష్కరించాలని జలమండలి అధికారులను ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ఆదేశించారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో స్థానిక కౌన్సిలర్లు, హెచ్ఎండబ్ల్యూఎస్, మిషన్ భగీరథ అధికారులతో కలిసి తాగునీటిపై సమీక్ష నిర్వహించారు. శంషాబాద్ పట్టణంలోని మధురానగర్, ఆర్బినగర్, సిద్ధ్దాంతి, ఆదర్శనగర్‌తో పాటు పలు కాలనీల్లో వేసవి కావడంతో తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిసిందన్నారు. తాగునీటి సమస్యను పరిష్కరించేందు కు అవసరమైన నిధులను ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సంబంధిత అధికారులు తాగునీటి సమస్య పరిష్కారం కోసం ఎన్ని నిధులు అవసరమవు తాచయో అంచనా వేయాలని ఆదేశించారు. సమావేశంలో హెచ్ఎండబ్ల్యూఎస్ డీఎం గోవింద్‌గౌడ్, మిషన్ భగీరథ ఏఈ అరుణ్, ఆర్‌డబ్ల్యూస్ ఏఈ సూర్యనారాయణ, చైర్పర్సన్ సుష్మ, వైస్ చైర్మన్ గోపాల్‌యాదవ్, పలువురు కౌన్సిలర్లు ఉన్నారు.
ఔటర్ లోపలి గ్రామాలకు తాగునీరివ్వాలి
ఔటర్‌రింగ్ రోడ్డు లోపలి గ్రామాలైన గొల్లపల్లి, రషిద్గూడ, చిన్నగోల్కొండ, బహదూర్‌గూడ, హమీదుల్లానగర్ గ్రామ పంచాయతీల్లో తాగునీటి సమస్య అధికంగా ఉందని శంషాబాద్ ఎంపీపీ జయమ్మ తెలిపారు. తాగునీటి సమస్యలను పరిష్కరించాలి హెచ్ఎండబ్ల్యూఎస్ డీఎం గోవింద్గౌడ్కు వినతి పత్రం అందజేశారు.
ఆడబిడ్డలకు పెండ్లికి ప్రభుత్వం అండ
శంషాబాద్ రూరల్, మార్చి 30: పేదింటి ఆడబిడ్డల పెండ్లికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే టి.ప్ర కాశ్ గౌడ్ అన్నారు. బుధవారంమండల పరిషత్ కార్యాలయంలో తహసీల్దార్ జనార్దన్‌రావు ఆధ్వర్యంలో షాదీముబాకర్, కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మండలంలోని 60మంది లబ్ధిదారులకు చెక్కులు పంపి ణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌గారి ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి,సంక్షేమ పథకాలు అమలు చేసి ఆదర్శంగా నిలుస్తున్నారని అనారు. గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ప్రజల సంక్షే మం కోసం ఇలాంటి పథకాలు అమలు చేయలేదని విమర్శించారు.కార్యక్రమంలో ఎంపీపీ జయమ్మ,జడ్పీటీసీ తన్విరాజు,మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేశ్ గౌడ్, వైస్ ఎంపీపీ నీలంనాయక్,సర్పంచ్‌లు సిద్ధులు, సతీష్‌యాదవ్, నర్సమ్మ,ఎంపీటీసీ యాదగిరి,మండలఅధ్యక్షుడు చంద్రారెడ్డి, మోహన్‌రావు,రాజు ముదిరాజ్, శ్రీకాంత్‌గౌడ్,పాండురంగారెడ్డి, బాబుకిరణ్,జగన్‌గౌడ్, అధికారులు సిబ్బంది, లబ్ధిదారులు పాల్గొన్నారు.