ఎల్బీనగర్/చంపాపేట, మార్చి 30: బైరామల్‌గూడ చెరువును రూ.3కోట్లతో ఆధునీకరిస్తున్నారు. చెరువులో మురుగునీరు కలువకుండా చర్యలు తీసుకుంటున్నారు. మురుగునీరు నేరుగా మూసీలోకి వెళ్లేందుకు పైపులైన్ పనులను పూర్తి చేశారు.
బైరామల్‌గూడ చెరువుకు చారిత్రక నేపథ్యం ఉంది. సరూర్‌నగర్ చెరువు తరహాలోనే మినీ ట్యాంక్‌బండ్ హంగులతో పనులు చేపట్టారు. ఎగువ ప్రాంతాల నుంచి చెరువులోకి మురుగునీరు రాకుండా పైపు లైన్లు ఏర్పాటు చేశారు.
మురుగు నీరు చెరువులో చేరకుండా చర్యలు..
బైరామల్‌గూడ చెరువు సుందరీకరణ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నాం. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే మురుగు నీరు చెరువులోకి చేరకుండా చర్యలు చేపట్టాము. వర్షాకాలం నాటికి వరదనీరు మాత్రమే చేరేలా చూస్తున్నాం. నిర్మాణ పనులు పూర్తయితే సుందరీకరణ పనులు చేపడుతాం. వర్షాకాలం నాటికి బైరామల్‌గూడ చెరువు సుందరీకరణ పనులను పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నాం.
– నాగరాజు, ఇరిగేషన్ డీఈ