వనస్థలిపురం, మార్చి 30: హస్తినాపురం డివిజన్లో జరుగుతున్న డ్రైనేజీ పనులను వేగవంతం చేయాలని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. బుధవారం డివిజన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాణ్యతా లోపాలు లేకుండా త్వరితగతిన పనులు నిర్వహించాలన్నారు. కాంట్రాక్టర్‌కు రావాల్సిన బిల్లులను ఇప్పించేందుకు కృషి చేస్తామన్నారు. వానకాలంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నామన్నారు. ప్రజలు అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు అందోజు సత్యంచారి, అధికారులు రామరాజు, రవీందర్‌రెడ్డి, రమేశ్, బాబు, హేమునాయక్, తదితరులు పాల్గొన్నారు.