మణికొండ/బండ్లగూడ/మైలార్‌దేవ్‌పల్లి, మార్చి 24 : ఉజ్వల భవిష్యత్తు, చక్కటి ఉద్యోగావకాశాలు పొందేందుకు సరైన వేదిక కేఎల్ డీమ్డ్ విశ్వవిద్యాలయమని యూనివర్సిటీ హైదరాబాద్ క్యాంపస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కోటేశ్వర్రావు పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ తర్వాత ఉన్నత విద్యావకాశాలపై నమస్తే తెలంగాణ, తెలంగాణ టు డే, కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ హైదరాబాద్ క్యాంపస్ కలిసి నార్సింగిలోని శ్రీ చైతన్య కళాశాల క్యాంపస్‌లో గురువారం విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటర్ తర్వాత ఏయే కోర్సులు ఎంచుకోవాలనే అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో బాగా రాణించే విద్యార్థులు మాత్రమే బీటెక్‌ను ఎంచుకుంటున్నారని, రానివారు బిజినెస్ మేనేజ్మెంట్ రంగం వైపు పయనిస్తున్నారని ప్రిన్సిపాల్ కోటేశ్వర్రావు వివరించారు. వివిధ కోర్సుల్లో విద్యనందించడంతోపాటు ఉపాధి బాటకు కేంద్ర బిందువుగా కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ నిలుస్తున్నదన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో బీటెక్ ద్వారానే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సాధ్యమనుకుంటున్న విద్యార్థులకు తమ యూనివర్సిటీ ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా విద్యార్థుల నైపుణ్యతను గుర్తించి వారికి అనుగుణంగానే అవకాశాలను కల్పిస్తున్నామని అన్నారు.
ఉజ్వల భవిష్యత్తుకు కేంద్రంగా..
60 శాతం మంది బీటెక్ చేసిన వారే సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలు సాధించారని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కోటేశ్వర్రావు గుర్తుచేశారు. ఇంటర్ తర్వాత ఏయే యూనివర్సిటీని ఎంచుకోవాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తపన పడుతుంటారు. ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో గూగుల్‌లో చూసి యూనివర్సిటీలను ఎంపిక చేసుకుంటున్నారు. సౌత్, నార్త్ ఇండియా ప్రాంతాల యూనివర్సిటీలను ఎంచుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదని ఆయన సూచించారు. యూనివర్సిటీని నేరుగా పరిశీలించి, సందేహాలను నివృత్తి చేసుకోవాలని సూచించారు. 1980 నుంచి కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ హైదరాబాద్ క్యాంపస్ శాస్త్ర, సాంకేతిక, వైజ్ఞానిక విద్యా కేంద్రంగా విరాజిల్లుతున్నదని ఆయన వివరించారు. 1980లో ఇంజినీరింగ్ కళాశాలగా ఏర్పడి, 2006లో స్వయం ప్రతిపత్త్తి(అటానమిక్ యూనివర్సిటీ)గా అవతరించి, 2009లో డీమ్డ్ టుబీ యూనివర్సిటీ మారిందని తెలిపారు. దేశంలోని కేటగిరి-1లో పది యూనివర్సిటీలు ఉన్నాయని, ఇందులో కేఎల్ యూనివర్సిటీ కూడా ఒకటి అని ఆయన గుర్తుచేశారు.
హైదరాబాద్‌లో 120 స్టార్టప్స్ ఉన్నాయని, సొంత ఇనిస్టిట్యూట్స్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చని వివరించారు. సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో ప్రతిభ, కమ్యూనికేషన్ సామర్థ్యం, నాయకత్వ లక్షణాలకు కార్పొరేట్ కంపెనీలు రూ.లక్షల్లో జీతాలు ఇస్తున్నాయని తెలిపారు. దీంతో ఇంజినీరింగ్ విద్యకు రోజురోజుకూ ఆదరణ పెరుగుతున్నదని అన్నారు. విద్యార్థులకు క్రమశిక్షణ చాలా అవసరమని, తల్లిదండ్రుల ఆశయాలను వమ్ము చేయవద్దన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో టెక్నాలజీని మంచికి ఉపయోగించాలని సూచించారు.
ప్లేస్మెంట్లో మేటిగా…
కేఎల్ యూనివర్సిటీలో లెక్చరర్, ల్యాబ్, స్కిల్ డెవలప్మెంట్పై ప్రతి శనివారం ప్రత్యేకంగా గైడ్ చేస్తారు. బీటెక్ మూడో సంవత్సరంలోనే మంచి ప్లేస్మెంట్ ఉంటుంది. నాలుగో సంవత్సరంలో నెలకు రూ.40వేల నుంచి రూ.50వేల వరకు, బీటెక్ పూర్తయిన తర్వాత రూ.4లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వేతనాలు ఇచ్చే కంపెనీలు ఉన్నాయి. విద్యార్థులు కేవలం చదువుపైనే కాకుండా అన్ని రంగాలపై దృష్టి పెట్టాలి.. అని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం నుంచి నేటి వరకు నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే దిన పత్రికలు బాగా ప్రాచుర్యం పొందాయని తెలిపారు. అవగాహన సదస్సు అనంతరం విద్యార్థులకు లక్కీ డ్రా ఏర్పాటు చేశారు. ఇందులో ఓ విద్యార్థి లక్కీ కూపన్లు పొందారు. ఈ సదస్సులో నమస్తేతెలంగాణ అడ్వర్టయిజ్మెంట్ మేనేజర్ రాజిరెడ్డి, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
కేఎల్ యూనివర్సిటీలో ఎందుకు చేరాలంటే..
దేశవ్యాప్తంగా చాలా యూనివర్సిటీలు ఉన్నాయి.. కేఎల్ యూనివర్సిటీనే ఎందుకు ఎంచుకోవాలి.. అని పలువురు విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ప్రిన్సిపాల్ కోటేశ్వర్రావు మాట్లాడుతూ.. తమ యూనివర్సిటీలో డాక్టరేట్ పొందిన ఉపాధ్యాయులే విద్యాబుద్ధులను నేర్పిస్తూ, పరిశోధనలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని తెలిపారు. యూనివర్సిటీకి ఎన్ఐఆర్ఎఫ్ (నేషనల్ ఇనిస్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేం వర్క్) గుర్తింపు కూడా ఉన్నదన్నారు. అంతర్జాతీయ స్థాయిలో 100 దేశాలతో కన్సల్టెన్సీ కలిగి ఉన్నదన్నారు. ఇప్పటి వరకు విదేశాల్లో చదువుకునే విద్యార్థుల్లో ఒక్కరికి కూడా వీసా తిరస్కరింపబడలేదన్నారు. మొదటి సెమిస్టర్ తమ యూనివర్సిటీలో పూర్తిచేసి, అవసరమైతే విదేశాల్లో రెండో సెమిస్టర్ చదువుకునే వీలు ఉన్నదన్నారు. కేఎల్ విశ్వవిద్యాలయంలో చదువుకునే విద్యార్థులకు వివిధ బ్యాంకుల్లో రుణసౌకర్యాన్ని కల్పిస్తున్నామన్నారు. మూడో సంవత్సరంలోనే విద్యార్థి నైపుణ్యతను గుర్తించి ఉద్యోగం కల్పించే వీలుందన్నారు. వివిధ కార్పొరేట్ కంపెనీలతో అనుసంధానమై ఉన్నదని తెలిపారు. అందుకే కేఎల్ యూనివర్సిటీలో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉన్నదని వివరించారు.
గతంతో పోల్చితే.. ఇప్పుడు మంచి అవకాశాలు
గతంలో చదువుకునేందుకు ప్రత్యేక కోర్సులంటూ ఏవీ ఉండేవి కాదు. ప్రస్తుతం విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మంచి అవకాశాలు కల్పిస్తున్నారు. అందులో కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ తమ ప్రత్యేకతను ఈ పోటీ ప్రపంచంలో చాటుకుంటున్నది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులను సాధించేందుకు నమస్తే తెలంగాణ దినపత్రికలో ‘నిపుణ’ అనే సంచికను ప్రతి గురువారం పాఠకులకు అందిస్తున్నాం. అవసరమైన వారు తమను సంప్రదిస్తే ప్రత్యేకంగా మెటీరియల్‌ను అందిస్తాం.
– సురేందర్‌రావు, జనరల్ మేనేజర్, నమస్తే తెలంగాణ అడ్వర్టయిజ్మెంట్
లక్ష్య సాధనతో ముందుకు సాగాలి
విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకుని ఆ దిశగా కష్టపడాలి. ఇంటర్ తర్వాత విద్యార్థులకు ఎలాంటి కోర్సులు తీసుకోవాలనే అంశాలపై అద్భుతమైన కార్యక్రమాన్ని కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ, నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే సంయుక్తంగా నిర్వహించడం అభినందనీయం. రెండు రాష్ర్టాల్లో కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ అత్యుత్తమ ఫలితాలను సాధిస్తున్నది. యూనివర్సిటీ ప్రతినిధులు మన కళాశాలకు విచ్చేసి సూచనలు, సలహాలను అందిస్తుండటం శుభసూచికం. ప్రభుత్వం నిర్వహిస్తున్న 16 ఇంజినీరింగ్ కళాశాలల్లో ఉత్తమమైన ప్రైవేట్ యూనివర్సిటీగా కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ అగ్రస్థానంలో ఉన్నది. విద్యార్థులు ఇంటర్మీడియట్ తర్వాత ఇలాంటి యూనివర్సిటీలో చేరి తమ కెరీర్‌ను అద్భుతంగా తీర్చిదిద్దుకోవాలి.
– చంద్రశేఖర్, నార్సింగి శ్రీచైతన్య కళాశాల ప్రిన్సిపాల్
మాకు మంచి అవకాశం దొరికింది..
ఇంటర్మీడియట్ తర్వాత తాము ఏ యూనివర్సిటీలో చేరి చదువుకుంటే ఎలాంటి ఉపాధి, ఉద్యోగావకాశాలు లభిస్తాయనే అంశాలపై కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ ప్రతినిధులు స్పష్టంగా వివరించారు. ఏయే కోర్సుల్లో చేరితే ఎలాంటి ఉద్యోగాలు చేయవచ్చు.. సొంతంగా పరిశ్రమలను స్థాపించుకోవాలంటే ఏయే కోర్సుల్లో చేరాలనే విషయాలపై అవగాహన కల్పించారు.
-ముకరాం, నార్సింగి శ్రీ చైతన్య కళాశాల క్యాంపస్
అన్ని అంశాలను వివరించారు..
ఉత్తమమైన ర్యాంకు సాధించి కేఎల్ విశ్వవిద్యాలయంలో చేరేందుకు కృషిచేస్తా. ఇంటర్మీడియట్ తర్వాత ఏయే కోర్సుల్లో చేరాలి.. అన్న విషయాలపై చాలా బాగా వివరించారు. ఖచ్చితంగా నేను అనుకున్న కోర్సులో చేరి మంచి ఉద్యోగం.. లేదా సొంతంగా పరిశ్రమను స్థాపించేందుకు కృషిచేస్తా.
– కౌశిక్, నార్సింగి శ్రీ చైతన్య కళాశాల క్యాంపస్
భవిష్యత్‌లో ఏం చేయాలో తెలిసింది..
ఉన్నత చదువులకు అత్యుత్తమ విశ్వవిద్యాలయం ఏదీ అనే విషయం స్పష్టంగా అర్థమైంది. ఇంటర్ తర్వాత నేను ఖచ్చితంగా కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీలోనే చేరుతా. భవిష్యత్ విద్యపై క్లారిటీ వచ్చింది. ఇకపై కష్టపడి చదివి ఉద్యోగం సాధిస్తా.
-శ్రావణ్, నార్సింగి శ్రీ చైతన్య కళాశాల క్యాంపస్