
నేరేడ్మెట్, సెప్టెంబర్ : నేరేడ్మెట్ డివిజన్ పరిధిలోని రామాలయం సమీపంలో ఉన్న ఓపెన్ నాలా ప్రమాదకరంగా మారింది. అసలే ఇరుకు రోడ్లు.. దీనికి తోడు ఆక్రమణలు.. దీంతో నాలా కుదించుకుపోయింది. వర్షం వస్తుందంటే సమీప ప్రజలు భయంతో వణుకుతున్నారు.. భారీ వర్షాలకు నాలా పొంగిపొర్లి కాలనీలను ముంచేస్తుంది… దీనికితోడు దోమలు, దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి నాలాపై స్లాబ్ ఏర్పాటు చేయాలని కో రుతున్నారు. దీనిపై ఏఈ సృజనను ‘నమస్తే తెలంగాణ’ వివరణ కోరగా.. దేవీనగర్లో విస్తరించి ఉన్న ఓపెన్ నాలాపై సిమెంట్ పలకలు అమర్చడానికి సిద్ధంగా ఉంచామని.. అయితే కొందరు స్థానికులు స్లాబ్ కావాలని కోరడంతో మధ్యలోనే పనులు ఆపేశామన్నారు. అధికారుల నుంచి అనుమతులు రాగానే పనులు మొదలు పెడుతామన్నారు.