హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ)/ఖైరతాబాద్: భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కుల, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సాయంత్రం 4గంటలకు బ్లూ షర్ట్స్‌తో మహా శోభాయాత్ర నిర్వహించనున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి అన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. సుందరయ్య పార్కు నుంచి ట్యాంక్‌బండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వరకు నిర్వహించే బ్లూ షర్ట్స్ శోభాయాత్రలో పాల్గొనే ప్రతి ఒక్కరూ నీలి చొక్కాలు ధరించి, నీలి జెండాలు పట్టుకొని రావాలన్నారు. బీసీలకు 50శాతం, గిరిజన, ముస్లింలకు 12 శాతం, ఎస్సీలకు 20 శాతం, మాదిగలకు 12 శాతం రిజర్వేషన్లతో పాటు రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని కేంద్రాన్ని డిమాండ్ చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో టీఆర్ఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోపి, రజక సంక్షేమ సంఘం అధ్యక్షుడు ముప్పు భిక్షపతి, బీసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు ఎండల ప్రదీప్, కొమ్ము తిరుపతి, మైస ఉపేందర్, పబ్బతి కృష్ణ, సుజిత్ రావన్, మహ్మద్ రహీం ఖాద్రి, మురహరి, జోగారావు, సాయన్న, లావణ్య, రమ్య, సురేశ్, నరేశ్, మహేశ్, పాండురంగ, ధన్‌రాజ్, శేఖర్, దర్శన్, తదితరులు పాల్గొన్నారు.