
చర్లపల్లి, నవంబర్ 22 : పేదల సంక్షేమం కోసం లయన్స్ క్లబ్‌ల కృషి హర్షణీయమని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. కుషాయిగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం లయన్స్ క్లబ్ ఆఫ్ కుషాయిగూడ ఆధ్వర్యంలో మందులను నిల్వ చేసేందు కు ఫ్రిజ్‌ను డిస్ట్రిక్ట్ గవర్నర్ ఆవుల గోపాల్‌రావుతో కలిసి ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సీఎం కేసీఆర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు గ్రేటర్ పరిధిలో బస్తీ దవాఖానలను ఏర్పాటు చేశారని అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు బస్తీ దవాఖానల్లో ప్రభుత్వం సౌకర్యాలు కల్పిస్తుందని అన్నారు.
అదేవిధంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో లయన్స్ క్లబ్‌ల ఆధ్వర్యంలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ వైద్యశాల చైర్మన్, మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, వైద్యులు సంపత్‌రావు, స్వప్నారెడ్డి, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు కాసం మహిపాల్‌రెడ్డి, కుమారస్వామి, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు పిైళ్లె, ప్రతినిధులు నర్సింహారావు, వెంకట్‌రెడ్డి, రవీందర్, రాజు, శేర్ మణెమ్మ, కందుల లక్ష్మీనారాయణ, శిరీషారెడ్డి, యార్లగడ్డ దుర్గా, నర్సింహులు, శ్రీనివాస్, కృష్ణ, సదాలక్ష్మి, క్రాంతిరెడ్డి, అల్లూరయ్య, శ్రీనాథ్‌తో పాటు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.