
ఉస్మానియా యూనివర్సిటీ, నవంబర్ 11: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీసీఏ (సీబీసీఎస్) రెండో సెమిస్టర్ ప్రాక్టికల్ పరీక్షలను ఈనెల 22వ తేదీ నుంచి, ఎంసీఏ (సీబీసీఎస్) రెండో సెమిస్టర్ మెయిన్, బ్యాక్లాగ్ ప్రాక్టికల్ పరీక్షలను ఈనెల 26వ తేదీ నుంచి, ఎంఫార్మసీ (పీసీఐ) రెండో సెమిస్టర్ మెయిన్, బ్యాక్లాగ్, మొదటి, మూడో సెమిస్టర్ సప్లమెంటరీ పరీక్షలను ఈనెల 30వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
15 నుంచి ఎంబీఏ తరగతులు
ఎంబీఏ మూడో సెమిస్టర్ తరగతులను ఈనెల 15వ తేదీ నుంచి నిర్వహించ నున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. వర్సిటీ పరిధిలోని అన్ని ఎంబీఏ కళాశాలలు ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని సూచించారు.