Kriti Sanon | బ్రేకప్ రూమర్లకు కృతి సనన్ ఫుల్ స్టాప్ .. బాయ్‌ఫ్రెండ్ కబీర్‌తో ఫోటో వైరల్!
Kriti Sanon | బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ వ్యక్తిగత జీవితం మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. గత కొంతకాలంగా లండన్‌కు చెందిన వ్యాపారవేత్త కబీర్ బాహియాతో ఆమె ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల వీరిద్దరూ విడిపోయారంటూ సోషల్ మీడియాలో పలు కథనాలు వైరల్ అయ్యాయి.
Kriti Sanon | బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ వ్యక్తిగత జీవితం మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. గత కొంతకాలంగా లండన్‌కు చెందిన వ్యాపారవేత్త కబీర్ బాహియాతో ఆమె ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల వీరిద్దరూ విడిపోయారంటూ సోషల్ మీడియాలో పలు కథనాలు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో కృతి చేసిన తాజా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఆ రూమర్లకు చెక్ పెట్టిందా అనే చర్చ మొదలైంది. కృతి సనన్ ఇటీవల తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఈ ఏడాది తొలి ఆరు నెలలకు సంబంధించిన ప్రత్యేక క్షణాలను ‘హాఫ్ ఇయర్లీ డంప్’ పేరుతో అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫోటోలలో ఆమె కుటుంబ సభ్యులు, సోదరి నుపూర్ సనన్, పెంపుడు కుక్క, పర్యటనలకు సంబంధించిన చిత్రాలతో పాటు నటి రష్మిక మందన్నతో దిగిన ఫోటోలు కూడా ఉన్నాయి.
అయితే అందరి దృష్టిని ఆకర్షించింది కబీర్ బాహియాతో ఉన్న ఒక ఫోటో. లైవ్ మ్యూజిక్ ఈవెంట్లో ఇద్దరూ కలిసి కనిపించిన ఈ ఫోటోలో ఒకరినొకరు ఆప్యాయంగా హత్తుకున్నట్లు కనిపించారు. దీంతో వీరిద్దరూ ఇప్పటికీ రిలేషన్‌లోనే ఉన్నారనే అభిప్రాయాలు సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి. కొద్ది రోజుల క్రితం కబీర్ బాహియా మరో యువతితో కలిసి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, కృతి–కబీర్ మధ్య బ్రేకప్ జరిగిందనే ప్రచారం మొదలైంది. అయితే జాతీయ మీడియా కథనాల ప్రకారం, కబీర్‌కు సన్నిహిత వర్గాలు ఆ ప్రచారాన్ని ఖండించాయి. వైరల్ అయిన ఫోటోలో కనిపించిన యువతి కబీర్ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలని, ఆమెను ఆయన సోదరిలా భావిస్తారని పేర్కొన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియకుండా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరిగిందని వారు తెలిపినట్లు ఆ కథనాలు వెల్లడించాయి.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కృతి సనన్ తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడారు. తన సంబంధాలపై బహిరంగంగా చర్చించేందుకు ఆసక్తి లేదని, వివాహం జరిగే వరకు వ్యక్తిగత విషయాలను ప్రైవేట్‌గా ఉంచాలనుకుంటున్నానని ఆమె చెప్పారు. నాకు పెళ్లి అయిన తర్వాతే నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతాను. కొన్ని విషయాలు నాకు, నా కుటుంబానికే పరిమితం కావాలి అని ఆమె పేర్కొన్నారు. ఇక కెరీర్ విషయానికి వస్తే, కృతి సనన్ ప్రస్తుతం షాహిద్ కపూర్, రష్మిక మందన్నతో కలిసి నటించిన ‘కాక్టెయిల్ 2’ విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తూ ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. అయితే కృతి–కబీర్ రిలేషన్‌పై ఇప్పటికీ ఇద్దరి నుంచి అధికారిక ప్రకటన ఏదీ రాలేదు. దీంతో సోషల్ మీడియాలో వినిపిస్తున్న అనేక వార్తలు, విశ్లేషణలు కేవలం ప్రచారంగానే పరిగణించాల్సి ఉంటుంది. అయితే కృతి షేర్ చేసిన తాజా ఫోటో మాత్రం బ్రేకప్ రూమర్లపై మరోసారి చర్చకు దారితీసింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఏపీలోని పలు జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక
Supreme Court | హిందూయిజం నుంచి ఇస్లాంకు మారితే బీసీ రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు తీర్పు
Gajab Raat | ‘గజ్బ్ రాత్’గా మారిన మనోజ్ బాజ్‌పేయ్ ‘గుస్ఖోర్ పండట్’.. ట్రైలర్ విడుదల!
Zaheerabad AO | 14 ఏళ్ల కృషికి జాతీయ గుర్తింపు.. జాతీయ ఉత్తమ అధికారిగా లావణ్య
Stock Market | దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్.. 1534 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్.. ఒక్కరోజే 2 శాతంపైగా లాభం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

