Rajasthan | పదమూడేళ్ల బాలికపై 30మంది సామూహిక అత్యాచారం.. నిందితులకు చెందిన నాలుగు హోటళ్లు కూల్చివేత
Rajasthan : రాజస్థాన్‌లో దారుణం జరిగింది. పదమూడేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. దాదాపు 30 మంది వరకు అత్యాచారం, లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నిందితులకు సంబంధించిన నాలుగు హోటళ్లను అధికారులు కూల్చేశారు. రాజస్థాన్‌లోని, శ్రీగంగానగర్‌కు చెందిన పదమూడేళ్ల బాలిక జూన్ 18న కిడ్నాప్‌నకు గురైంది.
Rajasthan : రాజస్థాన్‌లో దారుణం జరిగింది. పదమూడేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. దాదాపు 30 మంది వరకు అత్యాచారం, లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నిందితులకు సంబంధించిన నాలుగు హోటళ్లను అధికారులు కూల్చేశారు. రాజస్థాన్‌లోని, శ్రీగంగానగర్‌కు చెందిన పదమూడేళ్ల బాలిక జూన్ 18న కిడ్నాప్‌నకు గురైంది. బాలికను స్తానిక రిక్షా కార్మికుడు ఎత్తుకెళ్లి ఒక హోటల్ నిర్వాహకుడికి ఇచ్చేశాడు.
ఆ హోటల్ ఓనర్ బాలికపై హోటల్లో అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఇతర హోటళ్లకు కూడా బాలికను తీసుకెళ్లాడు. అలా, నాలుగు హోటళ్లలో చిన్నారిపై అత్యాచారం, లైంగికదాడి జరిగింది. దాదాపు ఐదు రోజులపాటు బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. వివిధ హోటళ్లలో మొత్తం 30 మంది వరకు ఈ దారుణానికి ఒడిగట్టారు. దీంతో బాలిక నొప్పితో ఇబ్బంది పడుతూ, ఏడుస్తుంటే తనకు ఆల్కహాల్ తాగించి, మరీ లైంగిక దాడి చేశారు. ఈ దాడిలో నాలుగు లేదా అంతకుమించి హోటల్స్ ఓనర్స్ ప్రధాన పాత్ర పోషించారు. అంతేకాకుండా ఈ లైంగికదాడిని దాచిపెట్టే ప్రయత్నం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
నలుగురు ప్రధాన నిందితులకు సంబంధించిన నాలుగు హోటళ్లను బుధవారం బుల్డోజర్లతో కూల్చేశారు. ఈ ఘటనలో ఇప్పటివరకు మొత్తం 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. మిగతావారి కోసం గాలిస్తు్న్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హరిశంకర్ తెలిపారు. ఈ అత్యాచారంపై స్థానికుల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ భారీ ఎత్తున నిరసనలు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘దాసరి నెమలిపూర్ మీదుగా చెర్కుపల్లి వరకు బస్సు నడపాలి’
Satish Kumar | బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటా : మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్
‘కోదాడ నియోజకవర్గంలోని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి’
Vishvajit More | వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో రజతం.. చరిత్ర సృష్టించిన యువ రెజ్లర్..!
BSF camp | బీఎస్ఎఫ్ క్యాంప్‌లో ఫుడ్ పాయిజనింగ్.. 75 మంది సిబ్బంది ఆస్పత్రిపాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

