
సికింద్రాబాద్/ఘట్కేసర్, నవంబర్ 20: పరిశుభ్రత, పచ్చదనం, చెత్త సేకరణ.. ఇలా ఎన్నో పర్యావరణ సంబంధ విషయాల్లో కంటోన్మెంట్‌బోర్డుకు ఎనలేని గుర్తింపు ఉండగా.. తాజాగా జాతీయస్థాయిలో స్వచ్ఛ సర్వేక్షణ్-2021 అవార్డును కైవసం చేసుకుంది. శనివారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర పట్టణ వ్యవహారాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి హర్దీప్సింగ్ నుంచి కంటోన్మెంట్ బోర్డు సీఈవో అజిత్‌రెడ్డి స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డును అందుకున్నారు. చెత్త సేకరణ, పారిశుధ్య నిర్వహణపై అనేక కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు స్వచ్ఛ ఆప్ ఉపయోగించడంతో కంటోన్మెంట్ బోర్డు ఈ అవార్డుకు ఎంపికయ్యిందని బోర్డు సీఈవో అజిత్‌రెడ్డి అన్నారు.