నాంపల్లి క్రిమినల్ కోర్టు, మార్చి 12, నమస్తే తెలంగాణ: సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరిగి డబ్బు, సమయం వృథా చేసుకోకుండా రాజీ పద్ధతిలో కేసులు పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ మంచి అవకాశమని హైదరాబాద్ వాణిజ్య వివాద పరిష్కార ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి డాక్టర్ పట్టాభి రామారావు అన్నారు. జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా పురానా హవేలీలోని సిటీ సివిల్ కోర్టు ఆవరణలో శనివారం నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన మాట్లాడారు. కాగా, జాతీయ లోక్ అదాలత్‌కు మంచి స్పందన వచ్చిందని హైదరాబాద్ జిల్లా న్యాయసేవాధికార సంస్థ సిటీ సివిల్ కోర్టు చైర్పర్సన్, చీఫ్ జడ్జి రేణుక తెలిపారు. జాతీయ లోక్ అదాలత్ లో మొత్తం 18 బెంచీలను ఏర్పాటు చేశామని, 67,434 కేసులు పరిష్కారమయ్యాయని మెట్రోపాలిటన్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి రాధిక జైస్వాల్ తెలిపారు.
రంగారెడ్డి జిల్లా కోర్టులు, మార్చి 12(నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 48 లోక్ అదాలత్ బెంచీలను ఏర్పాటు చేసి.. 94వేల 275 కేసులను పరిష్కరించినట్టు జిల్లా ప్రధాన న్యాయమూర్తి తిరుపతి తెలిపారు. ఇదిలా ఉంటే రాచకొండ పోలీసు కమిషనరేట్‌కు చెందిన 55,772 కేసులు పరిష్కారమయ్యాయి.