హిమాయత్‌నగర్,మార్చి12: వేసవిలో తాగునీటి ఎద్దడి సమస్య తలెత్తకుండా ఉండేందుకు జలమండలి అధికారులు నీటి పొదుపునకు చర్యలు తీసుకుంటున్నారు. నారాయణ గూడ జలమండలి డివిజన్-5 పరిధిలో లీకేజీలతో వృథా అవుతున్న తాగునీటికి అడ్డుకట్ట వేసేందుకు కార్యాచరణ మొదలు పెట్టారు. లీకేజీలు అవుతున్న తాగునీటి పైపులైన్లను గుర్తించడం వాటికి తక్షణ మరమ్మతులు చేయడంతో పాటు వాల్వ్ ద్వారా నీటివృథాను అరికట్టడానికి కృషి చేస్తున్నారు. దీంతో చాలావరకు తాగునీటి వృథాను అరికట్టవచ్చని భావిస్తున్నారు.ఈ డివిజన్ పరిధి నుంచి ప్రతిరోజూ 23 ఎంజీడీ నీరు సుమారు 74 వేల కనెక్షన్లకు నీటి సరఫరా అవుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. నివాస గృహాలు, అపార్టుమెం ట్లు, వాణిజ్య సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానలు,ఆర్టీసీ డిపోలు తదితర వాటికి జలమండలి అధికారులు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. వేసవిలో నీటిని పొదుపుగా వాడుకోగలిగితే పౌరులు నీటి కష్టాలను దూరంగా ఉండవచ్చని జలమండలి అధికారులు పలు రకాలుగా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.
లీకేజీలకు మరమ్మతులు చేయిస్తున్నాం..
వేసవిని దృష్టిలో పెట్టుకుని తాగునీటి సమస్య తలెత్తకుం డా తగిన చర్యలు తీసుకుంటున్నాం.తాగునీటి వృథాను అరికట్టడానికి లీకేజీఅవుతున్నపైప్లైన్లు, వాల్వ్‌లను మరమ్మ తులు చేయిస్తున్నాం. అవసరమైన చోట పాత వాటి ని తొలగించి కొత్త పైప్లైన్లను ఏర్పాటు చేస్తున్నాం. తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ప్రజలు తమకు ఫిర్యాదు చేస్తే అధికారులు అందుబాటులో ఉండి సకాలంలో సరఫరా అయ్యేందుకు చొరవ తీసుకుంటాం.
– నారాయణ గూడ జలమండలి జీఎం సుబ్బరాయుడు