ఉస్మానియా యూనివర్సిటీ, మార్చి 12: విద్యారంగంలో విదేశీ పెట్టుబడులను అడ్డుకునే శక్తి విద్యార్థులకే ఉందని ఏపీటీఎఫ్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు పి.నర్సింహారెడ్డి అన్నారు.పాలకులు వారి స్వార్థ ప్రయోజనాల కోసం విదేశీ పెట్టుబడులను అనుమ తిస్తూ కార్పొరేట్‌కు సేవలకులుగా మారారని ఆరోపించారు.పీడీఎస్‌యూ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర జనరల్ బాడీ సమావేశాన్ని ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ లైబ్రెరీ బిల్డింగ్‌లోని ఐసీఎస్ఎస్ఆర్ సెమినార్ హాల్లో శనివారం నిర్వహించారు. సమావేశానికి ముందు ఆర్ట్స్ కళాశాల ఆవరణలో బిగి పిడికిలి జెండాను పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు జూపాక శ్రీనివాస్ ఎగురవేశారు.అనంతరం, భారీ ర్యాలీ నిర్వహిం చారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన నర్సింహారెడ్డి మాట్లాడుతూ విదేశీ పెట్టుబడులు, విదేశీ వర్సిటీలకు వ్యతిరేకంగా పోరాడాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఐఎఫ్టీయూ జాతీయ కార్యదర్శి ప్రదీప్ మాట్లాడుతూ దేశంలో మోడీ ప్రభుత్వం మతం ముసుగులో దేశాన్ని తాకట్టు పెడుతోందని ఆరోపించారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ నాయకులు సాగర్, గౌతమ్ ప్రసాద్,శ్రీకాంత్, మహేశ్, గడ్డం శ్యామ్, శ్రీకాంత్, కిరణ్, చందర్రావు, చరణ్, తిరుపతి, వినోద్, రాజేశ్వర్, సురేశ్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.