మెదక్ మున్సిపాలిటీ, మార్చి 8 : జిల్లాకేంద్రంలో 30వ వార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రాన్ని మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, కౌన్సిలర్లు గాయత్రి, లక్ష్మి, సీపీడీవో భార్గవితో కలిసి ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం అంగన్వాడీ కార్యకర్తలు, మెప్మా సిబ్బందిని సన్మానించి పండ్లు అందజేశా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను మున్సిపల్ వైస్ చైర్మన్ సన్మానించి ఖడ్గాన్ని అందజేశారు. కారక్రమంలో కౌన్సిలర్లు శ్రీనివాస్, లక్ష్మీనారాయణగౌడ్, మాజీ కౌన్సిలర్లు ముత్యంగౌడ్, కిషన్, టీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి కృష్ణాగౌడ్, నాయకులు లింగారెడ్డి, జీవన్‌రావు, కిరణ్, బాలరాజు, ప్రసాద్, లక్ష్మీనారాయణ, ఉమర్, వేణు, నవీన్, విఠల్‌గౌడ్ పాల్గొన్నారు.
రేణుకాంబ ఆలయంలో అన్నదానం
రేణుకాంబ ఆలయంలో అమ్మవారికి ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. అనం తరం చేపట్టిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ సురేందర్‌గౌడ్, గౌడ సంఘం అధ్యక్షుడు గడ్డమీది కృష్ణాగౌడ్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
కోనాపూర్ అంగన్వాడీ కేంద్రంలో సీమంతాలు
రామాయంపేట, మార్చి 8 : మండలంలోని కోనాపూర్ గ్రామ అంగన్వాడీ కేంద్రంలో గర్భిణులకు సీమంతాలు నిర్వహించారు. గ్రామానికి చెందిన పెండెల రాణి, బండి రేఖ, సునీతకు అంగన్వాడీ కార్యకర్తలు బండి సుమలత, రోజా, ఏఎన్ఎం శోభ, ఆశ వర్కర్ సంధ్య సీమంతం చేశారు. సీమంతానికి వచ్చినవారికి పసుపు కుంకుమతోపాటు పండ్లు, పువ్వు లు, గాజులు తదితర వస్తువులను గర్భిణులకు అందజేసి, మంచి పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు.