మాదాపూర్, మార్చి 6: మహిళలకు తగినంత ప్రోత్సా హం ఇస్తే వారు వివిధ రంగాలలో ఆదర్శవంతంగా నిలవ డం ఖాయం అని ఎక్సైజ్, ప్రొ హిబిషన్, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అం తర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకొని మా దాపూర్లోని హెచ్ఐసీసీలో ఆదివారం తెలంగాణ టీ ఛాం పియన్ షిప్-2022ను ఘనం గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మం త్రి వి.శ్రీనివాస్ గౌడ్ విచ్చేశా రు. హానరరీ కాన్సుల్, రిపబ్లిక్ ఆఫ్ బల్గేరియా ఫర్ తెలంగాణ, సుచరిండియా ఏపీ సీఈఓ లయన్ కిరణ్, నిలోఫర్ కేఫ్ చైర్మన్ ఏ.బాబూరావు, గోద్రెజ్, జెర్సీ సీఈఓ భూపేంద్ర సూరి, మల్లారెడ్డి హెల్త్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ ప్రీతిరెడ్డి, హైబిజ్ టీవీ మేనేజింగ్ డైరెక్టర్ మాడిశెట్టి రాజ్ గోపాల్‌లతో కలిసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, మహిళలతో టీ చాంపియన్ షిప్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు. ఇదివరకు ఎన్నడు లేని సరికొత్త విధానంతో రకరకాల టీలను పరిచయం చేయడం సంతోషంగా ఉందని అన్నారు. తెలంగాణ టీ చాంపియన్ షిప్లో నగర నలుమూలల నుంచి దాదాపు 100 మందికి పైగా మహిళలు విచ్చేసి కార్యక్రమంలో పాల్గొనగా, అందులో ప్రథమ బహుమతి విజేతకు రూ.లక్ష, ద్వితీ య బహుమతి విజేతకు రూ.50 వేలు, ముగ్గురు రన్నరప్‌లకు రూ.25 వేలను అందజేశారు. అనంతరం, పోటీల్లో గెలుపొందిన విజేతలకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా బహుమతులను అందజేశారు.