
మేడ్చల్ రూరల్, నవంబర్ 11 : గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ కండ్లకోయలోని సీఎంఆర్ సెట్ ఎంబీఏ విభాగానికి ‘బెస్ట్ బీ స్కూల్ ఇన్ ఇండియా’ పేరుతో నిర్వహించిన సర్వేలో చోటు దక్కింది. ది వీక్, హన్సా రీసెర్చ్ సర్వే -2021 ఉమ్మడిగా నిర్వహించిన సర్వేలో తెలంగాణ రాష్ట్రంలో 8వ ర్యాంకు లభించింది. అలాగే దక్షిణ జోన్లో 34వ స్థానం, జాతీయ స్థాయిలో 102వ ర్యాంకు లభించింది. ఈ సందర్భంగా కళాశాల కార్యదర్శి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ బెస్ట్ బీ స్కూల్లో స్థానం దక్కడం సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్లో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపర్చుకొని, ఉన్నత స్థానాన్ని సాధించేందుకు శ్రమిస్తామని పేర్కొన్నారు.