ముషీరాబాద్, మార్చి 6: కుటుంబ వ్యవస్థకు పునాది మహిళ అని ఎమ్మెల్సీ సురభి వాణిదేవీ అన్నారు. ఆదివారం చిక్కడపల్లి త్యాగరాయగానసభలో అరుంధతి వనితా వేదిక, బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్యల ఆధ్వర్యంలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఇంటిని నడుపుతూ ఉద్యోగాలు చేస్తున్న మహిళలు అష్టావధానం చేస్తున్నారని, ప్రతిభకు లింగబేధం లేదని తెలిపారు. కార్యక్రమంలో అరుంధతి వనితా వేదిక అధ్యక్షురాలు జయ, కార్యదర్శి సూర్యకుమారి, భాగ్యరేఖ పాల్గొని వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళా ప్రముఖులు రేవతి వేణుగోపాలచారి, నళిని, భానురేఖ, భవానీ, డాక్టర్ పద్మావతి, అనంతలక్ష్మి, నీలిమను సత్కరించారు.