సుల్తాన్‌బజార్,మార్చి 2 : హోంమంత్రి మహమూద్ అలీ పుట్టిన రోజును పురస్కరించుకుని మినిస్టర్ క్వార్టర్స్‌లోని ఆయన నివాసంలో టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ అధ్యక్షుడు డాక్టర్ ఎస్ఎం ముజీబ్‌హుస్సేనీ ఆధ్వర్యంలో బుధవారం మంత్రి కేక్ కట్ చేశారు. అనంతరం ఎంఎన్‌జే క్యాన్సర్ దవాఖానలో అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు ఎం రాజేందర్, ప్రధాన కార్యదర్శి ఆర్ ప్రతాప్, జిల్లా శాఖ కార్యదర్శి ఎస్ విక్రమ్‌కుమార్, ఉపాధ్యక్షులు కేఆర్ రాజ్‌కుమార్, ఉమర్ఖాన్, ప్రచార కార్యదర్శి కురాడి శ్రీనివాస్,సభ్యులు ఎంఏ ముజీబ్,ఖాలేద్ అహ్మద్, వైదిక్ శస్త్ర, శంకర్, ఎండీ వహీద్, క్యాన్సర్ దవాఖాన యూనిట్ సభ్యులు సుధాకర్,శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.