ఉప్పల్, మార్చి 1 : మహా శివరాత్రిని పురస్కరించుకుని మంగళవారం ఉప్పల్లోని శిల్పారామంలో నృత్యోదయ కూచిపూడి డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో కూచిపూడి నృత్యప్రదర్శనలు చేపట్టారు. ఈ సందర్భంగా కళాకారులు చేసిన నృత్యాలు ఎంతో ఆకట్టుకున్నాయి. శివోహం అనే నృత్యప్రదర్శన ఆధ్యంతం అబ్బురపరిచింది. వినాయక కౌతం, శివోహం నృత్యరూపకం, శివాష్టికం, జతిస్వరం, శివతరంగం, మహేశ్వరి మహంకాళి, నటేశకౌతం, నవదుర్గ అంశాల్లో నృత్యప్రదర్శన లు చేపట్టారు. ఈ ప్రదర్శనలను సూర్య అక్షయ, సుదీక్ష, శ్లోక, తన్వీ, విదీష, సువర్ణ, పావనీ, సునతి, శ్రావణి, శృతి, స్వాతి ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.