ఎర్రగడ్డ, ఫిబ్రవరి 28: పేదల సంక్షేమమే ధ్యేయంగా లెక్కలేనన్ని సంక్షేమ పథకాలను దిగ్విజయంగా అమలుపరుస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. ఎర్రగడ్డ డివిజన్ ఛత్రపతి శివాజీనగర్‌లో 125 మంది లబ్దిదారులకు ఇండ్ల పొజిషన్ సర్టిఫికెట్లను సోమవారం ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గోపీనాథ్ మాట్లాడుతూ, అనతి కాలంలోనే పేదల పక్షపాతిగా పేరు తెచ్చుకున్న కేసీఆర్ పొరుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులకు ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. దశాబ్ద కాలంగా ఛత్రపతి శివాజీనగర్ వాసుల కల ఇన్నాళ్లకు నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉన్నదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను, ప్రభుత్వాన్ని పని కట్టుకుని విమర్శించే విపక్షాలు ఇకనైనా కళ్లు తెరిచి వాస్తవాలను తెలుసుకోవాలని హితవు చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ షాహీన్‌బేగం, బాలానగర్ తహశీల్దార్ కృష్ణయ్య, ఆర్ఐ గాయత్రి, మాజీ కార్పొరేటర్ మహ్మద్ షరీఫ్, డివిజన్ అధ్యక్షుడు డి.సంజీవ, పల్లవి మహేందర్ యాదవ్, షరీఫ్ ఖురేషీ, కల్యాణి, గంట మల్లేశ్, పలువురు టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.