ఉస్మానియా యూనివర్సిటీ, ఫిబ్రవరి 28: ఉస్మానియా యూనివర్సిటీలో సైన్స్ దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఓయూ క్యాంపస్‌లోని ఏఎంఎస్ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన వేడుకులకు ముఖ్య అతిథిగా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వామన్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్‌ను సూపర్ పవర్‌గా తీర్చిదిద్దే శక్తి సైన్స్‌కు మాత్రమే ఉందని అన్నారు. యువతరం ఈ లక్ష్యాన్ని చేరేందుకు నిరంతరం కృషి చేయాలని సూచించారు. ఒక వైపు చిన్న దేశాలకు చెందిన శాస్త్రవేత్తలకు నోబెల్ అవార్డులు వస్తుంటే విశాల భూభాగం ఉన్న మనకు ఎన్ని వస్తున్నాయో.. నేటి యువత ఒకసారి ఆలోచించాలని సూచించారు.
ఓయూ సైన్స్ ఫ్యాకల్టీ డీన్ ప్రొఫెసర్ ఎ. బాలకిషన్, ఎన్జీఆర్ఐ మాజీ శాస్త్రవేత్త, ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్ శ్రీనగేశ్ మాట్లాడుతూ ఎటువంటి సదుపాయాలు లేని కాలంలోనే సర్ సీవీ రామన్ గొప్ప ఆవిష్కరణలు చేసి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. విద్యార్థి దశ నుంచే సైన్స్‌పై చిన్నారుల్లో ఆసక్తిని పెంపొందించాలని అభిప్రాయపడ్డారు. ప్రొఫెసర్ లక్ష్మణ్‌నాయక్, డాక్టర్ ఖలీల్ అహ్మద్ జిలాని, ప్రొఫెసర్ వీజే ఉషాప్రవీణ, డాక్టర్ కొడూరి కిరణ్మయి, డాక్టర్ రెడ్డి కుమారస్వామిలకు సర్ సీవీ రామన్ స్మారక అవార్డు – 2022లను అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ నకులారెడ్డి, డాక్టర్ రవితేజ తదితరులు పాల్గొన్నారు.
జేఎన్టీయూలో నేషనల్ సైన్స్ డే
సిటీబ్యూరో, ఫిబ్రవరి 28(నమస్తే తెలంగాణ): జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని జేఎ న్టీయూ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి వర్సిటీలో ఫిజిక్స్ విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా రామన్ ప్రభావం గురించి, దాని ప్రాముఖ్యత గురించి వివరించారు. ఫిజిక్స్ కోర్సు విస్తృతమైన ఉపయోగాల గురించి విద్యార్థులకు తెలి యజేశారు. జీవితంలో లక్ష్య నిర్ధారణ, లక్ష్య సాధన కోసం నిరంతరం పని చేసి భవిష్యత్తును ఎలా తీర్చి దిద్దుకోవాలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఓఎ స్డీ ధర్మా నాయక్, ప్రిన్సిపాల్ ప్రొ.ప్రభు కుమార్, వైస్ ప్రిన్సిపాల్ ప్రొ. ఎంటీ నాయక్ పాల్గొన్నారు.