సిటీబ్యూరో, ఫిబ్రవరి 28(నమస్తే తెలంగాణ): కాలిన గాయాలకు గురైన బాధితులకు చికిత్స అందించడం, సాధారణ సర్జరీలు చేయడంపై పీజీ చేసిన ప్రతి వైద్యుడికి అవగాహన ఉండాలని ఉస్మానియా దవాఖాన ప్లాస్టిక్ సర్జరీ విభాగాధిపతి, వైద్య కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మీ పలుకూరి అన్నారు. డాక్టర్ పీఆర్కే ప్రసాద్ అధ్యక్షతన రెండు రోజులుగా జరుగుతున్న ప్లాస్టి క్ సర్జరీ జాతీయ సదస్సులో ‘నేషనల్ అసోసియేషన్ ఆఫ్ బర్న్ ఇంజూరీస్’ తరపున తెలంగా ణ రాష్ట్రం నుంచి డాక్టర్ లక్ష్మీ పలుకూరి పాల్గొని ప్రసంగించారు. ఆమె మాట్లాడుతూ సాధారణం గా కాలిన గాయాలకు గురైన రోగులకు ప్లాస్టిక్ సర్జరీకి చెందిన వైద్యులే చికిత్స చేయడం, సర్జరీలు చేయడం జరుగుతుందని, అయితే, కాలిన గాయాలకు సంబంధించిన సాధారణ చికిత్స, సర్జరీస్పై పీజీ పూర్తి చేసిన ప్రతి వైద్యుడికి అవగాహన ఉండాలన్నారు.
కాలిన గాయాలకు గురై న రోగిని ఎలా హ్యాండిల్ చేయాలి, కాలిన మం టల నుంచి ఉపశమనం కలిగేందుకు రోగికి అం దించాల్సిన చికిత్సా విధానం, సాధారణ శస్త్ర చికిత్సలపై అవగాహన కల్పించడంతో పాటు పలు అంశాల్లో మెళకువలను చెప్పారు. కొయంబత్తూర్కు చెందిన డాక్టర్ రాజ సభాపతి మాట్లాడు తూ ‘డయాబెటిక్ ఫుట్’కు ప్లాస్టిక్ సర్జరీ ద్వారా చికిత్స చేసే విధానంపై వైద్య విద్యార్థులకు అవగాహన కల్పించారు. ముంబై డాక్టర్ వినయ్ సి కిందర్ మాట్లాడుతూ ఓరల్ క్యాన్సర్ రోగుల్లో ముఖంలోని దవడ, నాలుక వంటివి దెబ్బతిన్నప్పుడు సర్జరీ ద్వారా కొత్తరూపు ఇవ్వడంపై అవగాహన కల్పించారు. డాక్టర్లు కరుణ అగర్వాల్, భట్టాచార్య జూరీగా వ్యవహరించగా, కళాశాలల కు చెందిన పీజీ విద్యార్థులు, ప్లాస్టిక్ సర్జరీ విభాగాల విద్యార్థులు, వైద్య నిపుణులు పాల్గొన్నారు.