కందుకూరు, ఫిబ్రవరి 28 : పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తన బాషను మార్చుకోవాలని లేనిచో ప్రజలు తగిన బుద్ధిచెబుతారని రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కప్పాటి పాండురంగారెడ్డి తెలిపారు. సోమవారం కందుకూరు మండల కేంద్రంలో మాట్లాడుతూ.. రాష్ట్ర విద్యాశాక మంత్రి సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డిపై విమర్శలు చేశారని వారి జోలికొస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షుడు మూల హన్మంత్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గోపిరెడ్డి సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.