
ఖైరతాబాద్, నవంబర్ 17: రాష్ట్ర జనాభాలో 18 శాతానికి పైగా ఉన్న మున్నూరుకాపులకు సముచిత స్థానం కల్పించాలని మున్నూరుకాపు సంఘం తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ సర్దార్ పుటం పురుషోత్తమ రావు పటేల్ కోరారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అపెక్స్ కౌన్సిల్ ప్రత్యేక ఆహ్వానితులు కొండా దేవయ్య పటేల్‌తో కలిసి ఆయన మాట్లాడారు. ప్రస్తుతం స్థానిక సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న నలుగురు మున్నూరుకాపు సామాజికవర్గానికి చెందిన వారు పదవీ విరమణ పొందుతున్నారని, వారి స్థానంలో తిరిగి తమ వర్గాల వారికే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మనోజ్ పటేల్, వినోద్ , వీరస్వామి , సుమిత్ తదితరులు పాల్గొన్నారు.