కొండాపూర్, ఫిబ్రవరి 23 : మద్యం తాగుతున్న సమయంలో తలెత్తిన గొడవలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. చందానగర్ ఇన్స్పెక్టర్ కాస్ర్తో, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… శేరిలింగంపల్లి పాపిరెడ్డికాలనీకి చెందిన ఆంజనేయులు అలియాస్ అంజి (32) ఎలక్ట్రీషియన్. మంగళవారం రాత్రి రాధాకృష్ణ దేవాలయం ముందున్న ఖాళీ స్థలంలో స్థానికులు నగేశ్, వెంకట్, చిన్న, శివలతో కలిసి మద్యం తాగాడు.
ఆ తర్వాత వెంకట్, శివ, చిన్న అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం నగేశ్, అంజిల మధ్య వివాదం తలెత్తింది. ఆగ్రహంతో నగేశ్ బీరు బాటిల్ పగులగొట్టి అంజి గొంతు కోసి హత్య చేశాడు. నిందితుడిని అదుపులో తీసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. నగేశ్‌పై గతంలో హత్య కేసు నమోదై ఉందని ఇన్స్పెక్టర్ తెలిపారు. మృతుడికి భార్య సరోజ, ముగ్గురు పిల్లలు ఉన్నారు.