అమీర్‌పేట్, ఫిబ్రవరి 23 : తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సతీమణి, అమ్మల సంఘం అధ్యక్షురాలు పద్మకు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు ఆమె భౌతికకాయాన్ని సనత్‌నగర్ జెక్‌కాలనీలోని నివాసానికి తీసుకురాగా, పలువురు ఘనంగా నివాళులర్పించారు. మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, జగదీశ్‌రెడ్డి, మహమూద్ అలీతో పాటు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, క్రాంతికిరణ్, ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్, వెంకటేశ్వర్లు, సీఎం కార్యాలయ ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, పీఆర్వో రమేశ్హజారే, బుద్ధవనం ప్రాజెక్ట్ చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య, సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ నారాయణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డిలతో పాటు ‘నమస్తే తెలంగాణ’ సీఎండీ దీవకొండ దామోదర్‌రావు, ప్రముఖ వ్యాపారవేత్త లక్ష్మీరాజం, ‘తెలంగాణటుడే’ సంపాదకులు శ్రీనివాస్‌రెడ్డి, సాక్షి దినపత్రిక సంపాదకులు మురళి, ఆంధ్రజ్యోతి సంపాదకులు శ్రీనివాస్, ఏపీ మీడియా సలహాదారులు దేవులపల్లి అమర్, వేదకుమార్, టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణి, దేవీప్రసాద్, పీవోడబ్ల్యూ నాయకురాలు సంధ్య, ఎంబీ కృష్ణయాదవ్ తదితరులు పద్మ భౌతికకాయానికి శ్రద్ధాంజలి ఘటించారు.