దళిత బంధు పథకంపై లబ్ధిదారులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడుతున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి
మహేశ్వరం, ఫిబ్రవరి 23: దళితుల జీవితాల్లో వెలుగులు నింపడానికే సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం ప్రవేశ పెట్టారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం మహేశ్వరం మండల పరిషత్ కార్యాలయంలో దళిత బంధుపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..
రంగారెడ్డి జిల్లాలో 698 మంది
దళిత బంధు లబ్ధిదారులను ఎంపిక చేసినట్టు తెలిపారు. మొదటి దశలో రూ.17.75 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి వంద మంది లబ్ధి దారులను ఎంపిక చేసినట్టు చెప్పారు. ప్రతి దళిత కుటుంబం అన్ని రంగాల్లో ఆర్థికంగా బలపడాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ దళిత బంధును ప్రవేశపెట్టారని మంత్రి తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న చేయూతను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎంపీ రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశంలోని చాలా రాష్ర్టాలు తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలను ఆదర్శంగా తీసుకుంటున్నాయని అన్నారు.
దళిత బంధు పథకంతో అనేక దళిత కుటుంబాలు సామాజికంగా అభివృద్ధి చెందుతాయని తెలిపారు. ప్రధాన మంత్రి మోదీ తెలంగాణ పథకాలను కాపీ కొడుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కందుకూరు జడ్పీటీసీ జంగారెడ్డి, ఎంపీపీ రఘుమారెడ్డి, జిల్లా పరిశ్రమల శాఖాధికారి రాజేశ్వర్‌రెడ్డి, వ్యవసాయాధికారి గీతారెడ్డి, దళిత బంధు ప్రత్యేకాధికారి ఓంప్రకాశ్, జిల్లా ట్రాన్స్‌పోర్టు అధికారి రఘునందన్‌రావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ప్రవీణ్‌కుమార్, డీఆర్డీఓ ప్రభాకర్, జిల్లా ఉద్యానవన అధికారి సునంద, ఎంపీడీఓ నర్సింహులు, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆంగోత్ రాజు నాయక్, నాయకులు కూన యాదయ్య, కరోళ్ల చంద్రయ్య ముదిరాజ్, మద్ది కరుణాకర్‌రెడ్డి, హనుమగల్ల చంద్రయ్య, ఆనందం, నారాయణ రెడ్డి, కందుకూరు, మహేశ్వరం మండలాల దళిత బంధు లబ్ధిదారులు పాల్గొన్నారు.