-ఆకట్టుకునే విధంగా నమూనాల ఏర్పాటు
బంజారాహిల్స్,ఫిబ్రవరి 23: ఫిలింనగర్ నుంచి కొత్తచెరువు వైపు వెళ్లేరోడ్డు మధ్యలో ఏర్పాటు చేసిన సెంట్రల్ సుందరీకరణ పనులు తుది చేరుకున్నాయి. ఇప్పటికే జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ఆకర్షణీయమైన రీతిలో సెంట్రల్మీడియన్ నిర్మాణంతో పాటు వాకింగ్ ట్రాక్‌ను నిర్మించారు. సెంట్రల్ మరింత ఆహ్లాదంగా మార్చేందుకు అనేక రకాలైన పూల మొక్కలను జీహెచ్ఎంసీ అర్బన్ బయోడైవర్సిటీ విభాగం ఆధ్వర్యంలో నాటారు. ఓల్డ్ ముంబయి రోడ్డునుంచి ఫిలింనగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వైపు వచ్చేవారికి స్వాగతం పలికేలా సెంట్రల్ మీడియన్‌ను తీర్చిదిద్దుతున్నారు. అదనపు ఆకర్షణగా సినిమా పరిశ్రమలో ఉపయోగించే కెమెరాల నమూనాలు, కత్తి యుద్ధం సన్నివేశాల నమూనాలు తయారు చేస్తున్నారు. ఈ పనులకు తుది మెరుగులు దిద్దుతున్నారు. త్వరలోనే ఈ సెంట్రల్ మీడియన్‌ను ప్రారంభించాలని అధికాకారులు నిర్ణయించడంతో పనులు వేగంగా చేస్తున్నారు. ఫిలింనగర్ పేరుకు తగ్గట్లు ఇక్కడ ఏర్పాటు చేసిన నమూనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి.