ఎర్రగడ్డ/జూబ్లీహిల్స్, ఫిబ్రవరి 23 : ప్రతి ఒక్కరూ కొవిడ్ వ్యాక్సిన్ తీసుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్నదని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. రహ్మత్నగర్లో బుధవారం ‘అక్షయపాత్ర’ సహకారంతో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మురికివాడల్లో నివసిస్తున్న పేదలకు మెరుగైన వైద్య సౌకర్యం కల్పించాలన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడాలేని విధంగా బస్తీ దవాఖానలను ఏర్పాటు చేశారన్నారు. ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకునేలా అక్షయపాత్ర చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. అనంతరం రక్షా కిట్లను బస్తీవాసులకు ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఒక్కో కిట్లో బియ్యం, పప్పు, వంటనూనె తదితర నిత్యావసర వస్తువులను పొందుపర్చినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ నీలిమ, కార్పొరేటర్ సీఎన్ రెడ్డి, నేతలు మన్సూర్, సుబ్బరాజు, నాగకరాజు, షరీఫ్, శ్రీనివాస్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.