సికింద్రాబాద్, ఫిబ్రవరి 23: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యుడు పాండుయాదవ్ అన్నారు. పొదుపు సంఘాల మహిళలకు చేయూతనిచ్చేందుకు రాష్ట్ర సర్కారు ప్రత్యేక చొరవలు తీసుకుంటుందన్నారు. ఈ మేరకు బుధవారం వార్డులోని సీతారాంపురంకు చెందిన శ్రీ సరస్వతి మహిళా పొదుపు సంఘానికి బ్యాంకు ద్వారా రూ.4లక్షలు మంజూరు కాగా, బోర్డు మాజీ సభ్యుడు పాండుయాదవ్ ఆ సంద్ఘనికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలని అన్నారు. బ్యాంకులు ఇచ్చే రుణాలను సద్వినియోగం చేసుకొని స్వశక్తితో ఎదగాలన్నారు. మహిళా శక్తి ప్రపంచంలో చాలా గొప్పదని తెలిపారు. కార్యక్రమంలో పొదుపు సంఘం సభ్యులు జ్యోతి, రామలక్ష్మి, అంజనా, మంజుల, శిరీష, సరస్వతి, సుకన్య తదితరులు పాల్గొన్నారు.