సికింద్రాబాద్, ఫిబ్రవరి 21 : నార్త్‌జోన్‌లోని కార్ఖానా పోలీసులు తమ మానవత్వాన్ని చాటుకున్నారు. కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం ఒంటరిగా తిరుగుతున్న ఓ వృద్ధురాలిని(75) చేరదీసిన పెట్రో సిబ్బంది స్టేషన్‌కు తీసుకువచ్చారు. వృద్ధురాలి వద్ద ఉన్న ఆధార్ కార్డు ఆధారంగా విశాఖపట్నంకు చెందిన కేదరిశెట్టి తయారు లక్ష్మిగా గుర్తించారు. విశాఖపట్నం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించగా. అక్కడ మిస్సింగ్ కేసు నమోదైనట్లు విశాఖపట్నం పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలోని మథర్ థెరిస్సా వృద్ధాశ్రమంలో చేర్చారు. వారు వచ్చేవరకు అక్కడే ఉంటుందని పోలీసులు తెలిపారు. అయితే వృద్ధురాలిని చేరదీసిన పెట్రోమొబైల్ సిబ్బంది కన్నన్, రసూల్, రాజేంద్రప్రసాద్‌లను కార్ఖానా సీఐ రవీందర్ అభినందించారు.