పెద్దఅంబర్‌పేట, ఫిబ్రవరి 21 : ప్రతి విద్యార్థి సరైన మార్గంలో నడిచేందుకు ఇంటర్మీడియట్ చదువును సరైన వేదికగా ఎంచుకోవాలని, ప్రతి ఏడాది రెండు తెలుగు రాష్ర్టాల్లో కలిపి సుమారు రెండు లక్షల మంది విద్యార్థులు ఇంజినీరింగ్ విద్యను అభ్యసించి బయటికి వెళ్తున్నారని కేఎల్ యూనివర్సిటీ డైరెక్టర్ డాక్టర్ జె.శ్రీనివాస్‌రావు అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని కుంట్లూరు నారాయణ బాలికల జూనియకర్ కళాశాల ఆవరణలో ‘నమస్తే తెలంగాణ’, కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఇంటర్ తర్వాత కోర్సుల ఎంపిక, ఉద్యోగ అవకాశాలు, రుణ సదుపాయాలపై సోమవారం అవగాహన కల్పించారు.
క్వాలిఫైడ్ ఇంజినీర్లుగా ఎదుగాలి
ఇంజినీరింగ్ విద్యను అభ్యసించిన రెండు లక్షల విద్యార్థుల్లో కేవలం 30 శాతం వరకే విద్యార్థులు సరైన విధంగా ముందుకు వెళ్తున్నారని, మిగతా విద్యార్థులు రూ.10, 15 వేలకే పనిచేస్తున్నారని డైరెక్టర్ శ్రీనివాస్‌రావు అన్నారు. సర్టిఫైడ్ ఇంజినీర్లుగా కాకుండా క్వాలిఫైడ్ ఇంజినీర్లుగా విద్యార్థులు ఎదుగాలని పేర్కొన్నారు. కళాశాలల ఎంపికలోనే విద్యార్థి జీవితం ముడిపడి ఉంటుందని వివరించారు. కళాశాలల ఎంపికలోనే కొలువులకు మార్గం ఏర్పడుతుందన్నారు. కేఎల్ యూనివర్సిటీలో నిర్వహించే ప్రోగ్రాంలతో ఇంజినీరింగ్ చివరి సంవత్సరం విద్యార్థులు మంచి ప్యాకేజీలతో ఉద్యోగాలు సాధిస్తున్నారని పేర్కొన్నారు. కేఎల్ యూనివర్సిటీ అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక వసతులను కల్పిస్తున్నదని, విద్యార్థులకు పైసా ఖర్చు లేకుండా డిగ్రీ కోర్సులు పూర్తి చేసేందుకు ప్రోత్సాహం అందిస్తున్నదని తెలిపారు. విద్యార్థులకు మెరిట్ పరీక్ష నిర్వహించి ప్రతిభ చూపిన విద్యార్థులకు పది నుంచి వంద శాతం ఫీజుల్లో రాయితీ కల్పిస్తుందని చెప్పారు.
దేశంలోని 1000 యూనివర్సిటీల్లో 35వ స్థానం
దేశంలోని 1000యూనివర్సిటీల్లో కేఎల్ యూనివర్సిటీ 35వ స్థానంలో ఉందని శ్రీనివాస్‌రావు పేర్కొన్నారు. పేరు ప్రఖ్యాతలు కలిగిన సాఫ్ట్వేర్ కంపెనీలలో 52 లక్షల వరకు వార్షిక వేతనంతో ఉద్యోగాలు సాధించిన ఘనత కేఎల్ యూనివర్సిటీకే దక్కిందన్నారు. ఒక కోర్సులో డిగ్రీ చేస్తూ మరొక డిగ్రీలో చదివేలా డ్యూయల్ కోర్సులకు అవకాశం ఉందన్నారు. ఆర్థిక స్థోమత లేని విద్యార్థులు విద్యాలక్ష్మి పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. వచ్చే విద్యా సంవత్సరానికి అడ్మిషన్లను స్వీకరిస్తున్నామని, ఈ నెలాఖరులోగా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. 7997995697లో సంప్రదించవచ్చని వివరించారు. కార్యక్రమంలో నారాయణ కళాశాల ప్రిన్సిపాల్స్ అనిత, సులోచన, సుమలత ఉన్నారు.