ఉస్మానియా యూనివర్సిటీ, ఫిబ్రవరి 21: తార్నాకలోని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) యువ శాస్త్రవేత్త డాక్టర్ బైరోజు నవీన్‌కుమార్ అనారోగ్యంతో ఆదివారం రాత్రి మృతి చెందిడు. చెంగిచర్లలోని తన నివాసంలో అకాల మరణం పొందారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టర్ ఎం. కృష్ణారెడ్డి పర్యవేక్షణలో పీహెచ్డీ పట్టా సాధించిన నవీన్‌కుమార్ అనతి కాలంలోనే సంఖ్యాకశాస్త్రం, గణితం, కంప్యూటర్ సైన్స్, పోషకాహార రంగంలో ఉత్తమ శాస్త్రవేత్తగా పేరు గడించడంతో పాటు పలు అవార్డులు సైతం సాధించారు. సోమవారం ముగిసిన అంత్యక్రియల్లో ఎన్ఐఎన్ శాస్త్రవేత్తలు, సహా పరిశోధకులు పెద్ద ఎత్తున పాల్గొని నివాళులర్పించారు.