మలక్‌పేట, ఫిబ్రవరి 21: మాతా, శిశు మరణాల రేటును తగ్గించడంలో ఆశవర్కర్లు కీలకంగా పనిచేశారని, వారి సేవలు కొనియాడదగినవని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. మలక్‌పేట క్లస్టర్ పరిధిలోని పనిచేస్తున్న ఆశవర్కర్లకు శాలివాహననగర్ పట్టణ ఆరోగ్యకేంద్రం వద్ద సోమవారం స్మార్ట్ఫోన్లను మంత్రి పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గర్భిణులు,బాలింతలు, పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించడం, వారి ఆరోగ్యాన్ని కాపాడడంలోఆశవర్కర్ల పాత్ర వెలకట్టలేనిదన్నారు.
ఆరోగ్య సర్వే, ఇంటింటా జ్వర సర్వేలు చేసి ప్రజల ప్రాణాలను కాపాడారని వారి సేవలను కొనియాడారు. వారి సేవలను గుర్తించిన సీఎం కేసీఆర్ వారికి రెండుసార్లు జీతాలు పెంచి ఆదుకున్నారని గుర్తు చేశారు. ఆశవర్కర్లకు స్మార్ట్ ఫోన్లు అందించడం ద్వారా వారి సేవలు మరింత వేగంగా అందుతాయని అన్నారు. ఒక్కో క్లస్టర్ పరిధిలో 100మంది ఆశవర్కర్లకు ఫోన్లను అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం కార్పొరేటర్ భాగ్యలక్ష్మిమధుసూదన్రెడ్డి మాట్లాడుతూ క్లస్టర్ పరిధిలోని 25 మందికి స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశామని అన్నారు.
కార్యక్రమంలో డీఎంఅండ్ హెచ్ఓ వెంకటి, డిప్యూటీ డీఎంహెచ్ఓ బిర్జిస్ ఉన్నీసా, మెడికల్ అధికారులు డాక్టర్ వీణ, డాక్టర్ శాయిస్టా, ఆశవర్కర్ల సంఘం హైదరాబాద్ జిల్లా అధ్యక్షురాలు అపర్ణ, పీహెచ్ఎన్ చంద్రకళ, స్టాఫ్ నర్సులు కళావతి, జ్యోతి, ఏఎన్ఎంలు ఇందిర, సంతోషి, ఫార్మాసిస్ట్ మానస, ల్యాబ్ టెక్నీషియన్లు నరేందర్, శ్రీనివాస్, డీఈఓ శోభ, అమృత, మధుమోహన్, నాయకులు మధుసూదన్‌రెడ్డి, దేవేందర్, చందు, మాజీ కార్పొరేటర్ సునరితారెడ్డి, రఘునందన్‌రెడ్డి, మార్కెట్‌కమిటీ మాజీ వైస్ చైర్మన్ భూమేశ్వర్, డైరెక్టర్లు శ్రీధర్‌రావు, రవీందర్‌రెడ్డి, రాహుల్, చంద్రశేఖర్, ఎంఐఎం నాయకుడు షఫీ, ఆశవర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.