హిమాయత్‌నగర్, ఫిబ్రవరి21: నగర వాసులకు ఎన్నో ఏండ్లుగా చక్కటి, చిక్కటి టీని అందిస్తున్న కేఫ్ నిలోఫర్ మరో ముందడుగు వేసింది. సోమవారం హిమాయత్‌నగర్‌లో మరో నూతన బ్రాంచ్‌ను కేఫ్ నిలోఫర్ చైర్మన్ బాబూరావు, మేనేజింగ్ డైరెక్టర్ శశాంక్‌తో కలిసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, రాష్ట్ర మైనార్టీ అఫైర్స్ సలహాదారుడు ఏ.కే.ఖాన్, ఎమ్మెల్యే దానం నాగేందర్, ప్రభుత్వ సలహాదారుడు వేణుగోపాల్‌చారి, స్థానిక కార్పొరేటర్ జి.మహాలక్ష్మిరామన్గౌడ్ ప్రారంభించారు. కేఫ్ నిలోఫర్‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని నూతన బ్రాంచిని ఏర్పాటు చేయడం అభినందనీయమని వారు తెలిపారు.కేఫ్ నిలోఫర్ చైర్మన్ మాట్లాడుతూ లక్డీకపూల్, బంజారాహిల్స్ రోడ్ నం12లో ఉన్న కేఫ్ నిలోఫర్ నగర వాసులకు మధురానుభూతిని కల్గిస్తూ ఏన్నో ఏండ్లుగా సేవలను అందిస్తుందన్నారు.