మహేశ్వరం, ఫిబ్రవరి 21: గడికోట అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధ్దం చేయాలని అధికారులను మంత్రులు ఆదేశించారు. సోమవారం మహేశ్వరంలోని ప్రసిద్ధిగాంచిన గడికోట మైదానాన్ని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర ఎక్సైజ్, పురావస్తు, సాంస్కృతిక, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, జడ్పీ చైర్పర్సన్ తీగల అనితా హరినాథ్‌రెడ్డితో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గడికోటను ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం పురాతన కట్టడాలు, వారసత్వ సంపదను భావితరాలకు అందించడంలో భాగంగా నూతన హంగులతో మెరుగులు దిద్ది అభివృద్ధి చేస్తున్నట్లు వారు తెలిపారు. అనంతరం మన్సాన్పల్లిలో ఏర్పాటు చేసే క్రీడామైదానాన్ని పరిశీలించారు.
అందులో రెండు ఎకరాల్లో ఆట స్థలం, ఒక ఎకరంలో షాపింగ్ మాల్, ఒక ఎకరంలో ఫంక్షన్‌హాల్‌ను ఏర్పాటు చేస్తామని వారు తెలిపారు. కార్యక్రమంలో హెరిటేజ్ డైరెక్టర్లు రాములు నాయక్, నారాయణ, తహసీల్దార్ ఆర్పీజ్యోతి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజునాయక్, మాజీ అధ్యక్షుడు చంద్రయ్య, జిల్లా రైతు సమన్వయ సమితి నాయకులు యాదయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ యాదగిరిగౌడ్, శివగంగ ఆలయ చైర్మన్ సుధీర్‌గౌడ్ సర్పంచ్‌లు, నాయకులు పాల్గొన్నారు.