సైదాబాద్, ఫిబ్రవరి 21: తెలంగాణ మరాఠా సమాజ్ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా అక్బర్‌బాగ్ డివిజన్ టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి నితీశ్రావు జోగ్డే ఎన్నికయ్యారు.మలక్‌పేటలో సోమవారం జరిగిన సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరాఠా సమాజ్ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. నూతన కమిటీ అధ్యక్షుడిగా సుందర్రావు వాగ్మారె, ఉపాధ్యక్షుడిగా వాగ్మారే రాజేశ్, జాయింట్ సెక్రటరీగా అశోక్‌రావు, కోశాధికారిగా కాంబ్లీ లక్ష్మణ్‌రావు ఎన్నికయ్యారు.