మల్కాజిగిరి, ఫిబ్రవరి 20 : చదువుతో మానసిక ఒత్తిడికి గురై ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన నేరేడ్మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ నర్సింహస్వామి కథనం ప్రకారం.. మంచిర్యాల్ జిల్లా మందమర్రికి చెందిన మల్లేశ్ ప్రైవేటు ఉద్యోగం చేస్తుంటాడు. అతడి కుమారుడు సాగర్ల శ్రవణ్(18) మియాపూర్‌లోని గాయత్రి కళాశాలో ఇంటర్ ఫైనలియర్ చదువుతున్నాడు. కొన్ని రోజుల కిందట చదువు వల్ల తీవ్ర ఒత్తిడికి గురి కావడంతో శ్రవణ్‌కు కౌన్సెలింగ్ ఇప్పించారు. గత కొన్ని వారాలుగా శ్రవణ్ నేరేడ్మెట్ వెంకటేశ్వరనగర్‌లో ఉంటున్న బంధువుల వద్ద ఉంటున్నాడు. అయితే శ్రవణ్ బంధువులు ఈ నెల 18న సాయంత్రం ఊరికి వెళ్లి 19న తిరిగి ఇంటికి వచ్చేసరికి లోపలి నుంచి గడియపెట్టి ఉన్నది. తలుపులు తట్టినా తీయకపోవడంతో స్థానికుల సాయంతో ఇంటి తలుపులు తెరిచారు. లోనికి వెళ్లి చూగగా, శ్రవణ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం సికింద్రాబాద్‌లోని గాంధీ మార్చురీకి తరలించారు.