బంజారాహిల్స్,ఫిబ్రవరి19: చత్రపతి శివాజీ జయం తి వేడుకలు ఖైరతాబాద్ నియోజకవర్గంలో శనివారం ఘనంగా నిర్వహించారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, వెంకటేశ్వరకాలనీ డివిజన్ల పరిధిలో శివాజీ చిత్రపటాలను ఏర్పాటు చేసి నివాళులర్పించారు. ఫిలింనగర్‌లోని జ్ఙానీజైల్సింగ్నగర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏఐసీసీ అధికార ప్రతినిది డా.దాసోజు శ్రావణ్, టీపీసీసీ కార్యదర్శి రోహిణ్‌రెడ్డి తదితరులు పాల్గొని శివాజీ చిత్రపటానికి నివాళులు అర్పించారు. బంజారాహిల్స్ డివిజన్ ప్రేమ్‌నగర్‌లో అంబేద్కర్ సేవాసంఘం ఆధ్వర్యంలో శివాజీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ ఈ కార్యక్రమంలో సేవాసంఘం నేతలు భగవాన్‌దాస్, మున్నా పాల్గొన్నారు.
హిమాయత్‌నగర్ డివిజన్లో..
హిమాయత్‌నగర్,ఫిబ్రవరి19: ఛత్రపతి శివాజీని నేటి యువత ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని హిమాయత్‌నగర్ కార్పొరేటర్ జి.మహాలక్ష్మి సూచించారు. ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా శనివారం నారాయణగూడలో బైక్‌ర్యాలీని ఆమె ప్రారంభించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు నర్సింగ్‌గౌడ్, జైస్వా ల్,ప్రవీణ్,సాయి పాల్గొన్నారు.