సిటీబ్యూరో, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): వరద ముంపునకు శాశ్వతంగా చెక్ పెట్టే దిశగా జీహెచ్ఎంసీ చర్యలు వేగవంతం చేసింది. అత్యవసర పనుల కేటగిరీ కింద నాలాల విస్తరణ, అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసే లక్ష్యంతో టెండర్ ప్రక్రియలో కొన్ని నిబంధనలకు వెసులుబాటు కల్పించింది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన బుధవారం ఐదవ స్టాండింగ్ కమిటీ సమావేశమయ్యింది. ఇందులో 29 అంశాలకు సభ్యులు ఆమోదముద్ర వేశారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు పన్నాల దేవేందర్ రెడ్డి, మహ్మద్ అబ్దుల్ సలామ్ షాహిద్, మహపర, ముస్తఫా బేగ్, ప్రవీణసుల్తాన, బతా జబీన్, విజయ్ కుమార్ గౌడ్, సీఎన్.రెడ్డి, మందడి శ్రీనివాస రావు, వై.ప్రేమ్ కుమార్, సామల హేమ, కుర్మ హేమలత, జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్.లోకేశ్ కుమార్, అడిషనల్ కమిషనర్లు పౌసమి బసు, శృతి ఓజా, యూబీడీ అడిషనల్ కమిషనర్ కృష్ణ, జోనల్ కమిషనర్లు, ఈఎన్సీ జియా ఉద్దీన్, ఎస్ఆర్డీపీ సీఈ దేవానంద్, సీసీపీ దేవేందర్ రెడ్డి, అడిషనల్ సీపీ శ్రీనివాస్, హౌసింగ్ ఓఎస్డీ సురేష్, ఎల్ఏ వెంకటేశ్వర్లు, ఏసీ ఫైనాన్స్ అడిషనల్ కమిషనర్ కెనడి, అకౌంట్ చీఫ్ ఎగ్జామినర్ వెంకటేశ్వర్ రెడ్డి, కార్యదర్శి లక్ష్మి పాల్గొన్నారు.
ఆమోదించిన అంశాలు..
గోపన్‌పల్లి గ్రామంలోని కోమటికొండ చెరువు, గోసాయికుంట సంరక్షణ కోసం రిస్టోరేషన్, సివరేజ్ మళ్లింపు పనులకు రూ. 554.50 లక్షల పరిపాలన అనుమతులకు..
కుత్బుల్లాపూర్ మండలం నందనగర్ గ్రామ హెచ్ఎంటీ చెరువు, గాజుల రామారం కొత్త చెరువు, లాల్సాబ్గూడలోని రామన్న చెరువు అభివృద్ధి పనులు రూ. రూ. 7.24 కోట్లకు..
శేరిలింగంపల్లి మండలం లింగంపల్లి గోపి చెరువు, మక్తా మహబూబ్పేట్ మేడికుంట బీకే ఎన్క్లేవ్ లేక్, గోపన్‌పల్లి చిన్న, పెద్ద చెరువు మరమ్మతు పనులకు రూ.6.68 కోట్లకు..
మేడ్చల్ మలాజ్ గిరి జిల్లా అల్వాల్ మండలంలోని చిన్నరావిని చెరువు పనులకు రూ.2.39 కోట్లు..
మల్కాజ్గిరి మండలం బండ చెరువు పునరుద్ధరణ పనులకు రూ.2.40 కోట్లు..
గాజుల రామారంలోని పెద్ద చెరువు అభివృద్ధి పనుల కోసం రూ.2.96 కోట్లు..
పటాన్చెరు మండలం తిమ్మక్క చెరువు పునరుద్ధరణ పనుల కోసం రూ.2.43 కోట్ల పరిపాలన అనుమతులకు ఆమోదం తెలిపారు.
ఆస్తుల సేకరణ కోసం..
ఆర్డిపి కింద నేషనల్ హైవే 65 ముంబయి (అశోక గోల్డెన్ మాల్) నుంచి గ్రీన్ హిల్స్ రోడ్ వయా ఐడీఎల్ లేక్, ఐడీఎల్ ఎక్స్‌ప్లోజివ్ లిమిటెడ్ వరకు 30 మీటర్ల రోడ్డు వెడల్పునకు 10 ఆస్తుల సేకరణకు, కూకట్ పల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి ఐడీఎల్ లేక్ వయా ఎన్ఆర్సీ గార్డెన్, ద క్రీక్ ప్లానెట్ సూల్ వరకు 18 మీటర్ల రోడ్డు వెడల్పునకు 43 ఆస్తుల సేకరణకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపేందుకు ఆమోదం తెలిపారు.
రీవైస్డ్ ఆర్డీపీ కింద రాంనగర్ నుంచి అంబేదర్ కాలేజ్ జంక్షన్ వయా వీఎస్టీ జంక్షన్ వరకు సెకండ్ లేవల్ ఫె్లై ఓవర్, 15 మీటర్లు, 24 మీటర్లు, 27.8 మీటర్లు, 30 మీటర్ల రోడ్డు వెడల్పునకు 39 ఆస్తుల సేకరణకు..
ఆర్డీపీ కింద ఫరూక్ నగర్ బస్ డిపో నుంచి వట్టేపల్లి వయా ఫాతిమానగర్ 12 మీటర్లు, 18 మీటర్లు, 24 మీటర్ల రోడ్డు వెడల్పునకు, హెచ్‌టీ లైన్‌కు ఇరువైపులా 10 మీటర్ల రోడ్డు వెడల్పునకు మాస్టర్ ప్లాన్‌లో పొడగించడానికి, 174 ఆస్తుల సేకరణకు..
ఆర్డీపీ కింద సాయిఎన్‌క్లేవ్ నుంచి కాప్రా చెరువు వయూన్ మిడోస్ వెంచర్స్, శివసాయి నగర్ 12 మీటర్ల రోడ్డు వెడల్పు నకు 13 ఆస్తుల సేకరణకు..
ఆర్డీపీ కింద ఐజి స్టాచ్యూ నుంచి బొల్లారం – కొంపల్లి వరకు 30 మీటర్ల రోడ్డు వెడల్పునకు 408 ఆస్తుల సేకరణకు..
ఆర్డీపీ కింద బిస్మిల్లా హోటల్ నుంచి డీఆర్డీవో కాంపౌండ్‌వాల్ వరకు 9 మీటర్ల రోడ్డు వెడల్పునకు 118 ఆస్తుల సేకరణకు..
రాజేంద్రనగర్ శాస్త్రీపురం ఆలీభాయ్ క్రాస్ రోడ్ వద్ద కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్ స్పోర్ట్స్ సెంటర్ ఏర్పాటుకు అయ్యే వ్యయం రూ. 5.95 కోట్లకు..
సీఎస్ఆర్ పనుల కోసం..
సీఎస్ఆర్ ద్వారా షేక్‌పేట్ కొత్త చెరువు దత్తత, అభివృద్ధికి రోటరీ క్లబ్ హైదరాబాద్ ద్వారా పనులు, వ్యయం చేసేందుకు..
శేరిలింగంపల్లి మండల్ నానక్ రాంగూడ రంగులాల్కుంట, హఫీజ్‌పేట్ కొత్త చెరువు డెవలప్మెంట్, కన్జర్వేషన్ పనులు చేసేలా యూనైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్, జీహెచ్ఎంసీ చేసుకున్న ఎంవోయూపై కమిషనర్ సంతకానికి ఆమోదం..
మరికొన్ని..
అర్బన్ బయో డైవర్సిటీ వింగ్ కింద ఆరుగురు రిటైర్డ్ అధికారులను మరో సంవత్సరం పాటు (ఔట్ సోర్సింగ్) కొనసాగించే ప్రతిపాదనలకు..
జీహెచ్ఎంసీ పరిధిలోని వివిధ సర్కిళ్లలో స్థల మార్పిడి, వివిధ పనుల నిర్వహణకు ప్రతిపాదనలను తిరిగి పంపడంపై..
జీహెచ్ఎంసీ ఉద్యోగులకు డీఏ పెంపు జీవో అమలు, జీహెచ్ఎంసీ పెన్షనర్ల డీఏ పెంపు జీవోను అమలు పరిచే ప్రతిపాదనలకు..
జీహెచ్ఎంసీకి సంబంధించిన ఆదాయ, వ్యయ స్టేట్మెంట్ రిపోర్ట్(31 జనవరి 2022) సమర్పించేందుకు ఆమోదం.
రాజేంద్రనగర్ మెయిన్‌రోడ్డు నుంచి గ్రీన్‌వాక్ వే (జీహెచ్ఎంసీ పరిధి) వరకు 30 మీటర్ల రోడ్డు వెడల్పునకు, కల్వర్ట్ నుంచి గ్రీన్ వాక్ వే (జీహెచ్ఎంసీ పరిధి) 500 మీటర్ల పొడవు మార్పునకు మాస్టర్ ప్లాన్‌లో పొందుపర్చడంతో పాటు.. ఆస్తుల సేకరణకు ప్రతిపాదనలు పంపేందుకు ఆమోదం.
మహాజరీన్ క్యాంప్ నుంచి జూలుకన్న వరకు 40 మీటర్ల ఇంటర్నల్ రోడ్డు కోసం ప్రతిపాదనలతో పాటు మాస్టర్ ప్లాన్‌లో చేర్చడం.. ఇందుకు ఆస్తుల సేకరణపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపేందుకు ఆమోదం.