హైదరాబాద్ ఆట ప్రతినిధి, ఫిబ్రవరి16 : సీఎం కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్ జిల్లా రాష్ట్ర స్థాయి కేసీఆర్ వాలీబాల్ కప్‌ను రంగారెడ్డి జిల్లా జట్టు సొంతం చేసుకోగా హైదరాబాద్ జట్టు రన్నరప్‌గా నిలిచింది. మహిళల విభాగం ఫైనల్స్‌లో రంగారెడ్డి జట్టు 21-25, 25-17, 25-11 స్కోర్ తేడాతో హైదరాబాద్ జట్టుపై ఘన విజయం సాధించింది.
మూడవ స్థానానికి జరిగిన పోటీలో నల్గొండ జట్టు 25-19, 25-20 స్కోర్ తేడాతో వరంగల్ జట్టుపై గెలుపొందింది. విజేతలకు రాష్ట్ర క్రీడలు యువజన సర్వీసుల శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, హోంమంత్రి మహమూద్ అలీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నాగేశ్, తెలంగాణ జాగృతి ప్రతినిధులు నవీన్ ఆచార్య, రాజీవ్ సాగర్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మాజీ సభ్యుడు, టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ కార్యదర్శి, సాగర్ క్రికెట్ క్లబ్ కార్యదర్శి చాతిరి బాబురావు సాగర్, తెలంగాణ స్పోర్ట్స్ ఫెడరేషన్ కార్యదర్శి కపిల్ రాజ్ తదితరులు ట్రోఫీని అందజేశారు.
క్రికెట్ కప్ చాంప్ హైదరాబాద్
సీఎం కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని నిర్వహించిన క్రికెట్ కప్ టైటిల్‌ను హైదరాబాద్ ఎలెవన్ జట్టు సొంతం చేసుకుంది. లాల్‌బహుదూర్ స్టేడియంలో బుధవారం హోంమంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నాగేశ్, ఆర్టీఐ కమిషనర్ మహ్మద్ అమీర్, ఇండస్ట్రియల్ చైర్మన్ బాలమల్లు, టీఆర్ఎస్ నేత మహ్మద్ అమీర్ కేక్ కట్‌చేసిన అనంతరం అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్నారు.