ఖైరతాబాద్, ఫిబ్రవరి 16 : తెలంగాణలో బీసీల సంక్షేమంలో స్వర్ణయుగం తీసుకువచ్చి, సమున్నత లక్ష్యాలతో బలహీనవర్గాల సమగ్ర వికాసం, జీవన భరోసా కల్పించారు సీఎం కేసీఆర్. వారి ఆత్మగౌరవం పెంచే విధంగా బీసీ కులాలకు అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో 41 ఆత్మగౌరవ భవనాలు నిర్మించేందుకు స్థలాలు కేటాయించి, నిధులు మంజూరు చేశారు. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ నేతృత్వంలో గురువారం పీవీ మార్గ్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పీవీ మార్గ్‌లోని పీపుల్స్‌ప్లాజా వద్ద భారీ కటౌన్‌ను ఏర్పాటు చేశారు. ఉదయం 10.30గంటలకు చిత్రపటానికి బీసీ సంఘాల సమక్షంలో క్షీరాభిషేకం నిర్వహిస్తారు.