మాదాపూర్, ఫిబ్రవరి 16: చాయ్‌లోని సరికొత్త రుచులను నగరవాసులకు పరిచయం చేసేందుకు ఓ ప్రైవేట్ చానల్ ఆధ్వర్యంలో తెలంగాణ టీ చాంపియన్ షిప్‌ను నిర్వహించనున్నారు. ఈ మేరకు బుధవారం మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో నిర్వహించిన కార్యక్రమానికి నిలోఫర్ కేఫ్ డైరెక్టర్ శ్రీజ, గోద్రెజ్ జెర్సీ సీఈఓ బేపేంద్ర సూరి, హెచ్ఐసీసీ, నోవాటెల్ జనరల్ మేనేజర్ మనీష్ దయ్యా, హై బిజ్ టీవీ మేనేజింగ్ డైరెక్టర్ రాజగోపాల్‌లు ముఖ్య అతిథులుగా హాజరై టీటీసీ-2022 బ్రోచర్‌ను ఆవిష్కరించారు. సంధ్యా కన్వెన్షన్‌లో మార్చి 7న టీటీసీ పోటీలు నిర్వహిస్తున్నట్లు.. ఇందులో కేవలం మహిళలకు మాత్రమే అవకాశం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఆసక్తి గల మహిళలు www.hybiz.tv వెబ్సైట్లో లాగిన్ అయి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. విజేతలకు లక్ష రూపాయల బహుమతి అందిస్తామన్నారు. మరిన్ని వివరాలకు 8340974747 నంబర్లో సంప్రదించవచ్చన్నారు.