అమీర్‌పేట్/ బేగంపేట్ ఫిబ్రవరి 16 : ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడులకను సనత్‌నగర్ నియోజవర్గంలోని బేగంపేట్, రాంగోపాల్‌పేట్ డివిజన్లలో టీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం బేగంపేట్ డివిజన్లోని మయూరిమార్గ్లో దేవనార్ ఫౌండేషన్ అధ్వర్యంలో కొనసాగుతున్న అంధ విధ్యార్థుల పాఠశాలలో బేగంపేట్ డివిజన్ కార్పొరేటర్ మహేశ్వరి శ్రీహరి ఏర్పాటు చేసిన కేకును రాష్ట్ర హోం మంత్రి మహమూద్‌అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ హాజరై కట్ చేసి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించి వారితో సరదాగా గడిపారు. వారిచే కేక్ కట్చేయించి తినిపించారు. హజ్ కమిటీ చైర్మన్ మసి ఉల్లాఖాన్, బోయినపల్లి మార్కెట్ కమిటీ మాజీ డైరక్టర్ మహ్మద్ అఖిల్ హమ్మద్తో పాటు బేగంపేట్ డివిజన్ అధ్యక్షుడు సురేశ్‌యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి నరేశ్, నాయకులు శ్రీహరి, శేఖర్ ముదిరాజ్, తాళ్ల రాజయ్య పాల్గొన్నారు.
అమీర్‌పేట్ : మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న సీఎం కేసీఆర్ జన్మదినోత్సవాల్లో భాగంగా రెండో రోజు సనత్‌నగర్ నియోజకవర్గం పరిధిలో అన్నదానాలు, దేవాలయాల్లో హో మాలు, అభిషేకాలతో పాటు రక్తదాన శిబిరాలు, హరితహారం కార్యక్రమాలు నిర్వహించారు. వీటితో పాటు బేగంపేట్‌లోని దేవ్నార్ అంధుల పాఠశాలలో హజ్ కమిటీ చైర్మన్ మహ్మద్ మసీఉల్లా ఖాన్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో హోం మంత్రి మహమూద్‌అలీ ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులతో కేక్ కట్ చేయించి తినిపించారు.