మల్కాజిగిరి, ఫిబ్రవరి 15: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే సాధ్యమని మేడ్చల్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు అన్నారు. ఈ నెల 17న సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా మంగళవారం మల్కాజిగిరి, సాయినగర్ చౌరస్తాలో ఎమ్మెల్సీ.. కార్పొరేటర్ మేకల సునీతాయాదవ్తో కలిసి కేక్‌కట్ చేసి.. అన్నదానం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ప్రాణాలకు తెగించి పోరాడిన యోధుడని అన్నారు.
తెలంగాణ ప్రజల అభివృ ద్ధికోసం నిరంతరం తపిస్తున్నారని.. ఆయన ఆయూరారోగ్యాలతో ఉండాలని అన్నారు. ప్రజల అభివృద్ధే లక్ష్యంగా దేశంలో ఎక్కడాలేని విధంగా ఇక్కడ సంక్షే మ పథకాలు అమలు పరుస్తున్నారన్నారు. వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు నెలనెలా పింఛన్లు అందజేస్తున్నామని అన్నారు. పేదలకు డబుల్ బెడ్రూంలు, వ్యసాయదారులకు రైతు బంధు, ప్రైవేటు దవా ఖానల్లో చికిత్స పొందుతున్నవారికి సీఎం రిలీఫ్ ఫండ్లు అందజేస్తున్నామని అన్నారు. మైనారిటీల చదువుల కోసం రెసిడెన్సియల్ ఇంగ్లీష్ మీడియం స్కూళ్లు, ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, నోట్‌బుక్స్, యూని ఫాం, పోషకాహారాలతో కూడిన మధ్యాహ్న భోజనం అందజేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్‌ను విశ్వనగరంగా అభివృద్ధి చేస్తున్నారని అన్నారు.
– ఈ నెల 17న సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా మంగళవారం అల్వాల్ సర్కిల్లో కార్పొరేటర్లు స్కూళ్లలో విద్యార్థులకు, దవాఖానల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో కార్పొరేటర్లు సునీతాయాదవ్, ప్రేమ్‌కుమార్, శాంతిశ్రీనివాస్ రెడ్డి, సబితాకిశోర్, రాజ్ జితేంద్రనాథ్, మాజీ కార్పొరేటర్ జగదీశ్‌గౌడ్, మేకల రాముయాదవ్, పరుశురాంరెడ్డి, శ్రీనివాస్, గద్వాల జ్యోతి, అనిల్‌కిశోర్, సురేందర్‌రెడ్డి, రాజేశ్కన్న, సంతోశ్, మోసిన్, ఉదయ్, గౌస్, శ్రీశైలం, నాగేశ్వరరావు, బల్వంత్‌రెడ్డి, గౌస్, పాషా, మధు, అరవింద్, విశాల్, కవిత, లక్ష్మి, బబిత, ఉదయ, రమ్య, సింధుప్రియ, శశికళ, రమాదేవి, తదితరులు పాల్గొన్నారు.