ఉస్మానియా యూనివర్సిటీ, ఫిబ్రవరి 9: రాజ్యాంగమంటే ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ రవీందర్ ఎందుకు భయపడుతున్నారని ఏఐఎస్ఎఫ్ నాయకులు ప్రశ్నించారు. ఒక్కో విద్యార్థి సంఘానికి ఒక్కో న్యాయం చూపెడుతున్నారని ఆరోపిస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో బుధవారం ఓయూ ఆర్ట్స్ కళాశాలలో నల్ల రిబ్బన్లతో నిరసన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ కోసం ఓయూ ఆర్ట్స్ కళాశాల వేదికగా అనేక సభలు, సమావేశాలు జరిగాయన్నారు. కానీ భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం తాము సమావేశం నిర్వహించేందుకు అనుమతి అడిగితే ఇవ్వలేదని మండిపడ్డారు. వీసీ తీసుకొచ్చిన నిబంధనలను ఒక విద్యార్థి సంఘం ఉల్లంఘిస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. త్వరలోనే రాజ్యాంగ పరిరక్షణకు వేలాది మందితో ఆర్ట్స్ కళాశాల వేదికగానే సభ నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో నాయకులు కాంపల్లి శ్రీనివాస్, గ్యార నరేశ్, సత్య, చైతన్య, రాజు, గోపాల్, నవీన్, జ్ఞానేశ్వర్, రాజు తదితరులు పాల్గొన్నారు.